వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్వే: దక్షిణాదిన తగ్గిపోతున్న మోడీ ప్రభ, రెట్టింపయిన రాహుల్ గాంధీ ఇమేజ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: లోక్‌నీతి సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ సీఎస్‌డీఎస్ పోల్ సర్వేలో దక్షిణాదిన రానున్న ఎన్నికల్లో ప్రధానిగా నరేంద్ర మోడీ కంటే రాహుల్ గాంధీనే ఎక్కువ మంది కోరుకుంటున్నారు.

ముందస్తు ఎన్నికలు జరిగితే 34 శాతం ఓట్లు బీజేపీకి వస్తాయని, ఇది 2014లో సంపాదించిన దానికంటే మూడు శాతం అదనం అని, కానీ 2017 మే అంచనాల కంటే ఐదు శాతం తక్కువ అని తేలింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రతి నాలుగు ఓట్లలో ఒకటి కాంగ్రెస్‌కు పడుతుంది.

Positive perception of BJP govt has taken a dip, finds CSDS poll

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వానికి ప్రజాదరణ క్రమంగా తగ్గుతోందని తేలింది. ముఖ్యమంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ప్రభావం కనిపిస్తోంది.

బీజేపీ వెంట యువతే ఎక్కువగా ఉంది. గత ఎనిమిది నెలలుగా వీరి సంఖ్యా తగ్గుతూ వస్తోంది. ఉద్యోగాల కొరతే దీనికి ప్రధాన కారణంగా సర్వేలో వెల్లడైంది. దక్షిణాదిలో తదుపరి ప్రధాని రేసులో రాహుల్ గాంధీకి 27 శాతం మద్దతివ్వగా, మోడీకి 24 శాతం ఇచ్చారు. మోడీ ప్రజాదరణ 2017 మేలో పతాక స్థాయికి చేరింది. ప్రస్తుతం ఇది 2014 మే స్థాయికి పడిపోయింది. మరోవైపు రాహుల్‌ ప్రభ రెట్టింపయ్యింది.

English summary
In south India, Narendra Modi trails Rahul Gandhi as the prime ministerial candidate of choice, with Gandhi getting 27 per cent of the vote against Modi’s 24 per cent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X