మరో ఐదు నెలలపాటు ఫ్రీ రేషన్: నవంబర్ వరకు పీఎంజీకేఏవై పొడిగిస్తూ మోడీ కేబినెట్ నిర్ణయం
న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన(పీఎంజీకేఏవై) మరో ఐదు నెలలపాటు అంటే నవంబర్ వరకు పొడిగించాలన్న ప్రధాని మోడీ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పీఎంజీకేవై కింద దేశంలోని 81.35 కోట్ల మంది పేదలకు ఉచితంగా రేషన్ లభించనుంది. కేంద్రంపై మరో రూ. 94,000 కోట్ల అదనపు భారం పడనుంది.
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రజా పంపినీ వ్యవస్థ(పీడీఎస్) ద్వారా లబ్ధిపొందుతున్న పేదలు ఇబ్బందులు పడకూడదన్న లక్ష్యంతో ఈ పథకాన్ిన మొదటగా ఈ ఏడాది జూన్ వరకు పొడిగించారు. ఇప్పుడు మరో ఐదు నెలలపాటు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. గరీబ్ కళ్యాణ్ యోజనను ఈ ఏడాది దీపావళి వరకు మరో ఐదు నెలలపాటు పొడిగించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ ఈ మేరకు పథకం పొడిగింపు ప్రతిపాదనను ఆమోదించింది.
పీఎంజీకేఏవై కింద(నాలుగోదశ) అదనపు ఆహార ధాన్యాల సరఫరాను మరో ఐదు నెలలపాటు అదనంగా కేటాయించేందుకు కంేద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారునికి నెలకు ఉచితంగా 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాలను అందజేయనుంది. ఇప్పటికే రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు సబ్సిడీ రూపంలో అందుతోన్న ఆహారధాన్యాలకు ఇది అదనమని పేర్కొంది.












Click it and Unblock the Notifications