Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మాజీ ఎంపీ మీద మూడో రేప్ కేసు, బెయిల్ కోసం కోర్టుకు, బ్యాక్ పెయిన్ ఉందని?

మహిళలపై అత్యాచారం చేశాడని నమోదు అయిన కేసులో హాసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పోలీసు కస్టడీ ముగియడంతో ఈరోజు మళ్లీ కోర్టు ముందుకొచ్చారు. ట్రయల్ కోర్టు మాజీ ఎంపీ ప్రజ్వల్ కు జూలై 8వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ బెంగళూరు 42వ ఏసీఎంఎం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.ఇప్పుడు మూడో అత్యాచారం కేసు విచారణలో ఉందని పోలీసులు కోర్టుకు చెప్పారు.

ఈ కేసులో సిట్ అధికారుల 5 రోజుల కస్టడీ అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచారు. జిల్లా పంచాయతీ మాజీ సభ్యురాలు పెట్టిన అత్యాచారం కేసు ప్రజ్వల్‌పై మూడో అత్యాచారం కేసు నమోదు అయ్యింది. రెండవ అత్యాచారం కేసులో ప్రజ్వల్ ఇప్పటికే 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. ఈ కేసులో ప్రజ్వల్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా కోర్టులో విచారణ జరిగింది. బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో కేసు విచారణ పూర్తి అయ్యింది. ఇదే నెల 26వ తేదీన తీర్పు చెబుతామని కోర్టు చెప్పింది.

Prajwal Revanna approached the court for bail after a third rape case was registered

మూడో అత్యాచారం కేసులో జూన్ 19వ తేదీన కస్టడీ తీసుకున్న సిట్ అధికారులు తరువాత ప్రజ్వల్ ను జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు. జులై 8వ తేదీ వరకు ప్రజ్వల్ రేవణ్ణ బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార జైలుకు తరలించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.అత్యాచార ఆరోపణల నేపథ్యంలో మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను సిట్ అధికారులు బెంగళూరు నుంచి గత శుక్రవారం అంటే జూన్ 21వ తేదీన హసన్ లోని మాజీ ఎంపీ నివాసానికి తీసుకొచ్చారు.

జిల్లా పంచాయతీ మాజీ సభ్యురాలు ప్రజ్వల్ రేవణ్ణ మీద అత్యాచారం కేసు పెట్టింది. బాధితురాలు జిల్లా పంచాయితీ సభ్యురాలిగా ఉన్న సమయంలో అప్పటి హాసన్ ఎంపీ ప్రజ్వల్ నివాసంలోకి వెళ్లిన సమయంలో అక్కడే ఆమె మీద అత్యాచారం చేశారని బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా పంచాయితీ మాజీ సభ్యులిపై అత్యాచారం చేశారని నమోదు అయిన కేసులో ప్రజ్వల్ ను ఇప్పటికే ఆయన ఇంటికి తీసుకెళ్లి సుమారు 4 గంటలపాటు ఆ స్థలాన్ని పరిశీలించి ఆయన నుంచి వివరాలు సేకరించారు.

గత మే 4వ తేదీన బాధిత మహిళను తీసుకొచ్చి సిట్ అదే స్థలంలో స్థల పరిశీలన నిర్వహించింది. అదే బాధితురాలి కిడ్నాప్ కేసులో ప్రజ్వల్ తండ్రి, మాజీ మంత్రి రేవణ్ణ కూడా జైలుకు వెళ్లి తరువాత బెయిల్ మీద విడుదల అయ్యరు. ఇదే కేసులో ప్రజ్వల్ తల్లి భవానీ రేవణ్ణ సిట్ విచారణ ఎదుర్కొంటున్నారు. మొత్తం మీద హాసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కు మొదటి కేసులో బెయిల్ మంజూరు అయినా మూడో అత్యాచారం కేసులో బెయిల్ చిక్కడం కష్టం అని ఓ పోలీసు అధికారి అంటున్నారు. ఇదే సమయంలో ప్రజ్వల్ రేవణ్ణ బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్నాడని, ఆయనకు చికిత్స చేయించడానికి అవకాశం ఇవ్వాలని ఆయన న్యాయవాదులు కోర్టుకు మనవి చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+