వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కడ అలా ఉంటే, ఇక్కడికెందుకు..: ప్రకాష్ రాజ్ ఉద్వేగం

By Pratap
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: దక్షిణ కన్నడ జిల్లా కరావళి ఉత్సవాలకు వచ్చినప్పుడు నటుడు ప్రకాష్ రాజ్‌కు కొంత వ్యతిరేకత వ్యక్తమైంది. దక్షిణ కన్నడ జిల్లాలో 22నుంచి 31వరకు కరావళి ఉత్సవాలు శుక్రవారంనాడు ప్రారంభమయ్యాయి.

ప్రకాష్ రాజ్ రాకను పలు హిందూ సంఘాల ప్రతినిధులు వ్యతిరేకించారు. కేరళలో ఊపిరి తీసుకునేందుకు మంచి గాలి ఉందని వ్యాఖ్యానించినందుకు ఆయనకు ఆ వ్యతిరేకత ఎదురైంది. అక్కడ అలా ఉంటే మంగళూరుకు ఎందుకు వస్తావని ట్వీట్‌ చేశారు.

 అక్కడే ఉండాలని ట్వీట్లు...

అక్కడే ఉండాలని ట్వీట్లు...

కేరళలో మాత్రమే బాగా ఊపిరి తీసుకునే వాతావరణం ఉంటే అక్కడే ఉండాలని ప్రకాష్ రాజ్‌ను ఉద్దేశించి పలువురు ట్వీట్స్ చేశారు. ఆ వ్యతిరేకతపై కర్ణాటక ఆహార, పౌర సరఫరాల మంత్రి యూటీ ఖాదర్‌ తీవ్రంగా స్పందించారు. ప్రకాష్ రాజ్‌ ఇక్కడి పుట్టి పెరిగిన వారు ఎందుకు మంగళూరుకు రాకూడదని అడిగారు.

అడ్డుకోండి, చూద్దామని...

అడ్డుకోండి, చూద్దామని...

దమ్ము ఉంటే ప్రకాష్ రాజ్‌ను అడ్డుకోవాలని ఖాదర్ సవాల్ చేసారు. బీజేపీ నేతల తీరును బట్టే ఆ పార్టీ కార్యకర్తలు వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. మేం సూచించినట్లే దుస్తులు ధరించాలని, అటువంటి కథనాలే అచ్చు కావాలని, టెలివిజన్‌లో రావాలనే పద్ధతి మంచిది కాదనిఅన్నారు.

నేను కర్ణాటక కోస్తా ముద్దుబిడ్డను

నేను కర్ణాటక కోస్తా ముద్దుబిడ్డను

తనకు ఎదురైన వ్యతిరేకతను పట్టించుకోకుండా ప్రకాశ్‌రాజ్‌ శుక్రవారం మంగళూరులోని మంగళస్టేడియంలో జరిగిన కరావళి ఉత్సవంలో పాల్గొన్నారు. ఆయన ప్రసంగం ఉద్వేగభరితంగా సాగింది. తాను కోస్తా ముద్దుబిడ్డనని చెప్పుకున్నారు. తాను ఇక్కడే పుట్టానని తన తల్లిది గదగ్‌ జిల్లా అని చెప్పారు. ఫేస్‌బుక్‌లో చేసిన కొందరి వ్యాఖ్యలను, వారి భాషా సంస్కృతులను, దిగజారుడుతనాన్ని పట్టించుకోవాల్సిన అవసర లేదని అన్నారు. మనిషిని చంపాలనే ఆలోచన వచ్చిన తక్షణం అతడిలోని మానవత్వం చనిపోతుందని అభిప్రాయపడ్డారు.

 ఆయనపై ఇలా చురకలు

ఆయనపై ఇలా చురకలు

మైసూరు పార్లమెంటు సభ్యుడు ప్రతాప్ సింహాపై ప్రకాష్ రాజ్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఆయన పేరులో సింహా ఉంది... మరి ఆయన శాకాహారో, మాంసాహారో అర్థం కావడం లేదని, ఎందుకంటే ఆయన భాష శాకాహారులను తలపించడం లేదని ప్రకాష్ రాజ్ అన్నారు. మన భాషతోనే సంస్కృతిని, ఔన్నత్యాన్ని ప్రజలు గుర్తిస్తారని ఆయనఅన్నారు. తన అసలు పేరు ప్రకాశ్‌ రై అని సినిమా కోసం ప్రకాష్‌ రాజ్‌గా మార్చుకున్నానని చెప్పారు.

English summary
Actor Prakash Raj faced opposition from Hindu organisation during Karavali celebrations in South Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X