మోడీ సర్కారుకు ప్రణబ్ ప్రశంస, మాట్లాడలేకపోతున్నా..
కోల్‌కతా: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఎన్డీయే సర్కారును కొనియాడారు. ఎఫ్‌డీఐల విషయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ప్రణబ్ ఆదివారం ప్రశంసలు కురిపించారు. దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐ) ప్రవాహాన్ని పెంచే దిశగా మోడీ సర్కార్ తీసుకున్న చర్యలు బాగున్నాయన్నారు.
దేశంలో పేదరికం తగ్గించాలంటే దేశ ఆర్థికవృద్ధి రేటును ఎనిమిది నుండి తొమ్మిది శాతం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే దేశంలో పొదుపు చర్యలు పాటించడంతో పాటు విదేశీ పెట్టుబడులను ఆకర్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయాన్ని గుర్తించి విదేశీ పెట్టుబడులను పెంచే విధంగా కేంద్రం తీసుకున్న చర్యలు హర్షణీయమన్నారు.

ఇక రాష్ట్రపతిగా రాజ్యాంగపరమైన బాధ్యతల కారణంగా సమావేశాల్లో ఇతరులు చెప్పింది వినడమే తప్ప, ప్రభుత్వ విధానాలపై స్వేచ్ఛగా మాట్లాడలేకపోతున్నాని అన్నారు. రెండేళ్ల క్రితం వరకు ప్రభుత్వ విధానాల రూపకల్పనలో కీలకంగా వ్యవహరించానని, ఇప్పుడు రాష్ట్రపతి పదవిలో ఉన్న కారణంగా వాటిపై చర్చలు జరుగుతున్నప్పుడు ఏమీ మాట్లాడలేకపోతున్నానని అన్నారు.












Click it and Unblock the Notifications