కమల్ హాసన్ పై బెంగళూరులో కేసు: సినిమా కష్టాలు, హిందువులను !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: బహుబాష నటుడు కమాల్ హాసన్ మీద మరో సారి కేసు నమోదు అయ్యింది. హిందువులను కించపరిచి మా మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడారని ఆరోపిస్తూ హావేరి జిల్లా అరమల్లాపుర శరణబసవేశ్వర దేవాలయం పీఠాధిపతి ప్రణవానంద స్వామిజీ, ఆయన శిష్యులు కేసు పెట్టారు.

ఇటీవల ఓ టీవీ చానల్ కు ఇంటర్వూ ఇచ్చిన కమల్ హాసన్ మహాభారతం గురించి చెడుగా మాట్లాడారని, హిందువులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బెంగళూరు నగరంలోని ఉప్పరపేట పోలీస్ స్టేషన్ లో ప్రణవానంద స్వామిజీ కేసు పెట్టారు.

Pranavananda Swami files police complaint Upparpet police station Bengaluru, against Actor Kamal Hassan

కమల్ హాసన్ వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ప్రణవానంద స్వామిజీ, ఆయన శిష్యులు ఆరోపించారు. కమల్ హాసన్ వ్యాఖ్యలతో విద్యార్థులు చెడుదారి పట్టే అవకాశం ఉందని వారు ఆరోపిస్తూ కమల్ హాసన్ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కేసు పెట్టారు.

ఇప్పటికే కమల్ హాసన్ మీద తమిళనాడులో హిందూ మక్కల్ కట్చి సంస్థ నాయకులు రెండు కేసులు నమోదు చేశారు. ఇప్పుడు కమల్ హాసన్ మీద బెంగళూరులో మరో కేసు నమోదు కావడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Haveri District Aremallapura Saranabasavesvara Math Pranavananda Swami files police complaint Upparpet police station Bengaluru, against Actor Kamal Hassan for his remarks on Mahabharata.
Please Wait while comments are loading...