వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రశాంత్‌ కిషోర్‌ బిగ్ బాంబ్: భారత్ పై బీజేపీ ప్రభావం మరో నలభై ఏళ్ళ పాటు: రాహుల్ తో అదే సమస్య

|
Google Oneindia TeluguNews

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు కాంగ్రెస్ పార్టీకి మధ్య వ్యవహారం చెడిందా ? తాజాగా ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు అందుకు ఊతమిస్తున్నాయి. భారత దేశంలో బీజేపీ ప్రభావాన్ని, ప్రధాని నరేంద్ర మోడీ బలాన్ని రాహుల్ గాంధీ అవగాహన చేసుకోలేకపోతున్నారు, ఆయనతో ఉన్న ప్రధాన సమస్య అదేనా అంటే అవును అని తేల్చి చెబుతున్నారు ప్రశాంత్ కిషోర్. ఇక ప్రశాంత్ కిషోర్ తాజా వ్యాఖ్యలతో బీజేపీ శ్రేణులు సంబరాల్లో ఉంటే, కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా కంగు తింది.

భారత్ లో బీజేపీ మరో 40 ఏళ్ళ పాటు ప్రభావం చూపిస్తుందన్న పీకే

భారత్ లో బీజేపీ మరో 40 ఏళ్ళ పాటు ప్రభావం చూపిస్తుందన్న పీకే

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భారతదేశ రాజకీయాలలో బిజెపి పాత్రపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అనేక దశాబ్దాల పాటు బిజెపి భారత్ లో తన ప్రభావాన్ని చాటుతుంది అంటూ ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారంగా మారాయి. ఇదే సమయంలో రాహుల్ గాంధీ పైన షాకింగ్ కామెంట్స్ చేశారు ప్రశాంత్ కిషోర్. బీజేపీ అనేక దశాబ్దాల పాటు భారత్ పై ప్రభావం చూపుతుందన్న విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తించ లేక పోవడమే ఆయనకున్న ప్రధాన సమస్య అంటూ ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

భారత్ రాజకీయాలలో బీజేపే కేంద్ర బిందువుగా ఉంటుంది

గోవాలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడినట్లుగా భావిస్తున్న ఈ వీడియోను బిజెపి నేతలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. భారతీయ జనతా పార్టీ గెలిచినప్పటికీ, ఓడినప్పటికీ రాబోయే సంవత్సరాలలో బిజెపి ప్రధాన కేంద్రంగా ఉంటుందని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. భారత రాజకీయాలకు బిజెపి కేంద్రబిందువు కానుందని, కాంగ్రెస్ పార్టీకి అప్పట్లో నలభై ఏళ్ల పాటు ప్రభావం ఏవిధంగా ఉందో, బీజేపీకి కూడా అదే విధంగా ఉంటుందని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా స్వాతంత్రం వచ్చిన తొలి నలభై సంవత్సరాలలోపు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే ఉందో, అదేవిధంగా బీజేపీ కూడా ఉంటుందని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు.

 రాహుల్ గాంధీ ఈ విషయం గ్రహించలేకపోవటమే సమస్య

రాహుల్ గాంధీ ఈ విషయం గ్రహించలేకపోవటమే సమస్య

ఒకవేళ జనం మోదీని తిరస్కరించినా బిజెపి ఎక్కడికీ పోదని, ఇక్కడే ఉంటుందని వ్యాఖ్యానించారు ప్రశాంత్ కిషోర్ . ప్రధాని నరేంద్ర మోడీ బలాన్ని అర్థం చేసుకుని, అవగాహన చేసుకోనంతకాలం కాంగ్రెస్ పార్టీ ఆయనను ఓడించటం అసాధ్యమని ఇది రాహుల్ గాంధీ గ్రహించాలని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. తాజాగా ప్రశాంత్ కిషోర్ బీజేపీ పై ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు, రాహుల్ గాంధీపై, కాంగ్రెస్ పార్టీపై పేల్చిన బాంబులు కాంగ్రెస్లో చేరబోతున్నారని ప్రశాంత్ కిషోర్ పై సాగుతున్న ఊహాగానాలకు చెక్ పెట్టింది. రాహుల్ గాంధీ తో, కాంగ్రెస్ పార్టీతో చర్చలు పూర్తిగా విఫలమయ్యాయి అనడానికి ఈ వ్యాఖ్యలు దోహదం చేస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ కు తాజాగా గాంధీలతో జరిపిన చర్చలు విఫలమయ్యాయని తెలుస్తుంది.

దశాబ్దాల పాటు భారత రాజకీయాల్లో భాజపా ఒక శక్తిగా.. పీకే ఒప్పుకున్నారన్న బీజేపీ నేతలు

దశాబ్దాల పాటు భారత రాజకీయాల్లో భాజపా ఒక శక్తిగా.. పీకే ఒప్పుకున్నారన్న బీజేపీ నేతలు


ప్రశాంత్ కిషోర్ వచ్చే ఏడాది సముద్రతీర రాష్ట్రం అయిన గోవాలో జరిగే ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న మమతా బెనర్జీ యొక్క తృణమూల్ కాంగ్రెస్ ప్రచారం కోసం పని చేయడానికి గోవాలో ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ మాట్లాడిన వీడియోను ట్వీట్ చేసిన వారిలో బీజేపీకి చెందిన అజయ్ సెహ్రావత్ కూడా ఉన్నారు. చివరికి, రాబోయే దశాబ్దాల పాటు భారత రాజకీయాల్లో భాజపా ఒక శక్తిగా కొనసాగుతుందని ప్రశాంత్ కిషోర్ అంగీకరించారని ఆయన సోషల్ మీడియా ద్వారా వ్యాఖ్యానించారు. అమిత్ షా కూడా ఇదే విషయాన్ని ముందుగానే ప్రకటించారు అని అజయ్ సెహ్రావత్ పేర్కొన్నారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇటీవల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోసం పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు పనిచేశారు. తమిళనాడు రాష్ట్రంలో కూడా ప్రస్తుత సీఎం స్టాలిన్ కోసం పనిచేసి అద్భుతమైన విజయాలను అందించారు.

గాంధీ, కాంగ్రెస్ పార్టీ తో చర్చలు విఫలం అయినట్టు సంకేతాలు

గాంధీ, కాంగ్రెస్ పార్టీ తో చర్చలు విఫలం అయినట్టు సంకేతాలు

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో మరణించిన రైతుల కుటుంబాలను కలుసుకోవడానికి రాహుల్ గాంధీ మరియు అతని సోదరి ప్రియాంక గాంధీ వాద్రా యొక్క ఎత్తుగడలను ప్రశాంత్ కిషోర్ ప్రశ్నించారు . దురదృష్టవశాత్తూ కాంగ్రెస్ పార్టీలో లోతుగా పాతుకుపోయిన సమస్యలు మరియు నిర్మాణాత్మక బలహీనతలకు శీఘ్ర పరిష్కారాలు లేవు అని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఏప్రిల్-మే హలో జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో మమతా బెనర్జీ సంపూర్ణ విజయం సాధించిన తర్వాత, కాంగ్రెస్‌లో కీలక భూమిక పోషించటం కోసం గాంధీలతో ప్రశాంత్ కిషోర్ చర్చలు జరిపినట్లు జూలైలో వార్తలు వెలువడ్డాయి. కానీ ఆ తర్వాత, ఆ చర్చలు విఫలమైనట్లు నివేదికలు వచ్చాయి.

Recommended Video

Prabhas Supremacy.. ఈ ఆధిపత్యం అనితర సాధ్యం | Prabhas 25 | Spirit || Oneindia Telugu
పీకే రాహుల్ గాంధీతో భేటీ .. పలు అంశాల ప్రస్తావన, పొసగని చర్చలు

పీకే రాహుల్ గాంధీతో భేటీ .. పలు అంశాల ప్రస్తావన, పొసగని చర్చలు


ప్రశాంత్ కిషోర్ పార్టీని సరిదిద్దడానికి స్వేచ్ఛని కోరుకున్నారు. ఇదే సమయంలో వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల నుండి వైదొలగాలని కూడా కాంగ్రెస్ పార్టీని కోరినట్లు సమాచారం. దానికి బదులుగా 2024 జాతీయ ఎన్నికల కోసం సన్నాహాల్లోకి ఇప్పటి నుండే వెళదామని పేర్కొన్నాడని సమాచారం. అందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించకపోవటంతో వీరిద్దరి మధ్య జరిగిన చర్చలు విఫలం అయినట్లు గా తెలుస్తుంది. 44 ఏళ్ల ప్రశాంత్ కిషోర్, 2014 ఎన్నికల విజయంలో ప్రధానమంత్రి మోదీని గెలిపించడంలో కీలక పాత్ర పోషించినందుకు విస్తృతంగా ఘనత పొందారు, 2024 జాతీయ ఎన్నికలలో బీజేపీకి బలమైన సవాలును పెంచే ఎత్తుగడల్లో ప్రస్తుతం చురుకుగా వ్యవహరిస్తున్నారు.

English summary
Election strategist Prashant Kishor's remarks that the BJP will continue to exert its influence in India for another 40 years have now become a problem. He said the problem was that Rahul Gandhi could not understand the issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X