రూటు మారుస్తున్న ప్రశాంత్ కిషోర్ : సీఎంలు జగన్ - కేసీఆర్ కు సైతం : ఏం జరుగుతోంది..!!

ఇప్పుడు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. పశ్చిమ బెంగాల్.. డీఎంకే గెలుపులో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్..ఆ వెంటనే జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమికి సిద్దమయ్యారు. అవి ఫలించ లేదు. కాంగ్రెస్ లో పీకే చేరుతారనే ప్రచారమూ సాగింది. సోనియా - రాహుల్ తో సమావేశమయ్యారు. కానీ..కాంగ్రెస్ నాయకత్వ తీరు పైనే అసహనం వ్యక్తం చేసారు. అయితే, ఇప్పుడు అయిదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ సడన్ గా తెర మీదకు వచ్చారు. బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో భేటీ అయ్యారు.

నితీశ్ - ప్రశాంత్ కిషోర్ భేటీతో

నితీశ్ - ప్రశాంత్ కిషోర్ భేటీతో

దిల్లీలోని నితీశ్‌ నివాసంలో దాదాపు రెండు గంటల పాటు వీరిద్దరూ సమావేశమయ్యారు. రెండేళ్ల క్రితం జనతాదళ్‌(యునైటెడ్‌) పార్టీ నుంచి పీకేను తప్పించిన తర్వాత వీరిద్దరూ భేటీ అవడం ఇదే తొలిసారి. నితీశ్‌జీ కరోనా బారిన పడినప్పుడు నేను ఫోన్‌ చేసి పరామర్శించారు. ఆ సమయంలో నన్ను కలవాలనుకుంటున్నట్లు నితీశ్‌ చెప్పారు.

అందుకే నేడు మర్యాదపూర్వకంగా కలిశాను" అని ప్రశాంత్‌ కిశోర్‌ చెప్పారు. జేడీయూ నుంచి వైదొలిగినప్పటికీ నితీశ్‌తో తనకు మంచి సంబంధాలున్నాయని పీకే పలుమార్లు బహిరంగంగానే చెప్పారు. అంతేగాక, నితీశ్‌తో కలిసి మళ్లీ పనిచేయాలని కూడా అనుకుంటున్నట్లు తెలిపారు. ఇక, 2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీకి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పని చేసారు. ఆ ఎన్నికల్లో జగన్ గెలుపుకు సహకరించారు.

కేసీఆర్ సైతం అదే బాటలో

కేసీఆర్ సైతం అదే బాటలో

ఇప్పటికీ జగన్ - ప్రశాంత్ కిషోర్ మధ్య సత్సంబంధాలు కంటిన్యూ అవుతున్నాయి. వచ్చే నెల నుంచి ప్రశాంత్ కిషోర్ టీం రంగంలోకి దిగనుందని ...2024 ఎన్నికలే లక్ష్యంగా ముందుగానే పని చేయటం ప్రారంభిస్తుందని గతంలో కేబినెట్ సమావేశంలో స్వయంగా సీఎం చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా, తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ కు సైతం ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్త గా పని చేసేందుకు ఒప్పందం కుదిరినట్లుగా చెబుతున్నారు.

ఇదే సమయంలో...తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం బీజేపీని టార్గెట్ చేస్తూ.. ప్రధానంగా ప్రధాని మోదీ లక్ష్యంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. రాజకీయ యుద్దం ప్రకటించారు. నాన్ కాంగ్రెస్ - నాన్ బీజేపీ ముఖ్యమంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు.

జగన్ కు వ్యూహకర్తగా మాత్రమే

జగన్ కు వ్యూహకర్తగా మాత్రమే

అందులో భాగంగా ఈ రోజున ముంబాయి వెళ్లారు. అక్కడ మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేతో పాటుగా.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో భేటీ కానున్నారు. ఏపీ సీఎం జగన్ మాత్రం బీజేపీ - కేంద్ర ప్రభుత్వం పైన వ్యతిరేకంగా వ్యవహరించటానికి సిద్దంగా లేరు. కేంద్ర సాయం ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి అవసరం. దీంతో..సీఎం జగన్ ఇప్పటికిప్పుడు స్పందించే అవకాశం లేదనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు.. నితీశ్ తో ప్రశాంత్ కిషోర్ భేటీ ద్వారా బీజేపీకి గట్టి సందేశం ఇవ్వాలని భావించినట్లు బిహార్‌ సీఎం సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. 2018 సెప్టెంబరులో పీకే.. జేడీయూ పార్టీలో చేరారు.

Recommended Video

    UP Assembly Elections 2022 : తల్లీకొడుకులకి BJP ఝలక్ .. UP Politcs యమా హాట్ గురూ | Oneindia Telugu
    ఎన్నికల ఫలితాల తరువాత..

    ఎన్నికల ఫలితాల తరువాత..

    నితీశ్‌ ఆయనను పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించారు. అయితే కొద్ది రోజులకే వీరి మధ్య విభేదాలు వచ్చాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని 2020లో పీకేను జేడీయూ నుంచి బహిష్కరించారు. తిరిగి ఇప్పుడు...ప్రశాంత్ కిషోర్ తో కలవటం ద్వారా బీజేపీకి దూరం అవుతారా అనే చర్చ మొదలైంది. ఇక, అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత ప్రశాంత్ కిషోర్ వ్యూహం.. కేసీఆర్ అడుగులు.. జాతీయ స్థాయిలో రాజకీయ సమీకరణాల పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+