వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ గాంధీకి ప్రశాంత్ కిశోర్ సూచన .. మీరు ఆ ప్రకటన చెయ్యండి ప్రభావం చూడండి

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ రాహుల్ గాంధీకి ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించి కీలక సూచన చేశారు . పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరుల జాబితా (ఎన్‌ఆర్సీ)లకు వ్యతిరేకంగా జరుతున్న ఆందోళనలకు రాహుల్ గాంధీ మద్దతుగా నిలవడం హర్షణీయం అని పీకే పేర్కొన్నారు . అయితే రాహుల్ కు ఆయన కీలక ప్రతిపాదన కూడా చేశారు.

కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో సీఏఏ, ఎన్నార్సీలను అమలు చేయబోమంటూ ప్రకటన చెయ్యమన్న పీకే

కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో సీఏఏ, ఎన్నార్సీలను అమలు చేయబోమంటూ ప్రకటన చెయ్యమన్న పీకే

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తే మాత్రమే సరిపోదనీ.. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో సీఏఏ, ఎన్నార్సీలను అమలు చేయబోమంటూ అధికారికంగా ప్రకటించాలని కూడా ఆయన రాహుల్‌ను కోరారు. బీజేపీయేతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలిత అన్ని రాష్ట్రాల్లో ఎన్నార్సీ అమలు చేయబోమని ప్రకటన చెయ్యాలని ఆయన సూచన చేశారు. సీఏఏని కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టే ముందు నుంచే ప్రశాంత్ కిశోర్ దీన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు .

Anti CAA WAR: యూపీలో పోలీస్ కాల్పుల్లో ఒకరు మృతి చెందినట్టు అధికారిక ప్రకటనAnti CAA WAR: యూపీలో పోలీస్ కాల్పుల్లో ఒకరు మృతి చెందినట్టు అధికారిక ప్రకటన

పౌరసత్వ సవరణ చట్టాన్ని మొదటి నుండి వ్యతిరేకిస్తున్నపీకే

పౌరసత్వ సవరణ చట్టాన్ని మొదటి నుండి వ్యతిరేకిస్తున్నపీకే


ఇదే అంశంపై జేడీయూతో కూడా ఆయనకు అభిప్రాయ బేధాలు వచ్చాయి. అయినా సరే అవసరం అనుకుంటే పార్టీ పదవిని అయినా విడిచి పెట్టటానికి సిద్ధం అని చెప్పిన పీకే సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉన్నారు. నిన్న రాజ్‌ఘాట్ వద్ద కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహించిన నేపథ్యంలో పీకే రాహుల్ గాంధీ చేస్తున్న ఆందోళనపై తన అభిప్రాయం చెప్పారు. ఇక ఈ సందర్భంలో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇవాళ ట్విటర్ వేదికగా పీకే ఇదే విషయంపై స్పందిస్తూ..

రాహుల్ గాంధీకి సూచన చేసిన పీకే

రాహుల్ గాంధీకి సూచన చేసిన పీకే

సీఏఏ,ఎన్నార్సీలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజాందోళనలో జత కలిసినందుకు రాహుల్‌కు కృతజ్ఞతలు. అయితే సీఏఏ, ఎన్నార్సీలను అడ్డుకునేందుకు కేవలం ప్రజాందోళన మాత్రమే సరిపోదు. వీటిని తాము అమలు చేయబోమని రాష్ట్రాలు ప్రకటించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎన్నార్సీని అమలు చేయబోమని మీరు ‘అధికారికంగా' ప్రకటిస్తే.. అది మరింత ప్రభావం చూపగలదు'' అని పేర్కొన్నారు.

రాష్ట్రాలు నో అంటే కేంద్రం ఏం చెయ్యలేదన్న ప్రశాంత్ కిషోర్

రాష్ట్రాలు నో అంటే కేంద్రం ఏం చెయ్యలేదన్న ప్రశాంత్ కిషోర్


అయితే దేశ వ్యాప్తంగా ఆందోళనలు మిన్ను ముడుతున్నవేళ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఏం చెప్పారన్న దాన్ని తనకు గుర్తు చేసే బదులు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎన్నార్సీని అమలు చేయబోమంటూ ఆ పార్టీ చీఫ్ అధికారిక ప్రకటన విడుదల చేయాలని ఆయన ప్రతిపాదించారు. ఎన్నార్సీ అమలును రాష్ట్రాలు తిరస్కరిస్తే.. దీన్ని అమలు చేసి తీరతామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో చేసిన ప్రకటన నిజమయ్యే అవకాశమే ఉండదని పీకే అభిప్రాయపడ్డారు .

 బీజేపీయేతర రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాలన్న పీకే

బీజేపీయేతర రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాలన్న పీకే


పౌరసత్వ సవరణ బిల్లు (క్యాబ్)కు వ్యతిరేకంగా ఓటువేస్తే సరిపోదు. ఎన్నార్సీకి రాష్ట్రాలు నో చెబితేనే అది ఆగుతుంది. కాబట్టి ఇందులో ఎలాంటి గందరగోళం అవసరం లేదు... అని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. ఇక ఇదే స్టాండ్ మీద బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాలని పీకే సూచిస్తున్నారు. ఎన్నార్సీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

English summary
Prashanth kishore urged Rahul to formally announce that he would implement the CAA and NRC in the Congress-ruled areas. He said the announcement that the NCP would be implemented in all non-BJP states. Prashant Kishore has been opposing the CAA ever since the Center was introduced in Parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X