Prashant Kishor.. దండం రా దూత
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గెలుపోటముల మధ్య ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ కు అతీతంగా అన్ని పార్టీల అభ్యర్థుల్లోనూ గెలుపుపై ధీమా నెలకొంది. ఓటమిని ముందుగానే అంగీకరించడానికి ఎవరూ సిద్ధపడట్లేదు. ఈ నేపథ్యంలో భారీ విందుకు సన్నాహాలు జోరందుకున్నాయి. అన్ని పార్టీల అభ్యర్థుల నివాసాలు, పార్టీ కార్యాలయాలు నాయకులు, కార్యకర్తల కోలాహలంతో నిండిపోయాయి.
ప్రారంభ ఫలితాల్లో జనతాదళ్ (యునైటెడ్) భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి సునామీలా దూసుకెళ్తోంది. భారీ ఆధిక్యత సాధించింది. తొలి గంటలోనే ఆ కూటమి మేజిక్ ఫిగర్ ను అందుకుంది. ఆయా స్థానాలన్నింట్లో కూడా ఎన్డీఏ అభ్యర్థులు భారీ మెజారిటీని సాధించారు. రాష్ట్రీయ జనతాదళ్- కాంగ్రెస్ అభ్యర్థులను చిత్తు చేస్తోన్నారు.

అలీనగర్ నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థిని మైథిలీకుమార్ ఆధిక్యతలో కొనసాగుతున్నారు. బిప్లవ్ చౌదరి వెనుకంజలో ఉన్నారు. ప్రారంభ ఫలితాల్లో వెనుకపడ్డ తేజ్ ప్రతాప్ యాదవ్. సంజయ్ కుమార్ సింగ్ ఇక్కడ ఆధిక్యతలో కొనసాగుతున్నారు. మొకామాలో బాహుబలి అనంత్ సింగ్, తారాపూర్ లో సామ్రాట్ చౌదరి, దానాపూర్ లో కేంద్ర మాజీ మంత్రి కృపాల్ యాదవ్, బేతియాలో మాజీ డిప్యూటీ సీఎం రేణు దేవి.. తమ ప్రత్యర్థులపై భారీ ఆధిక్యత సాధించారు.
ఈ ఎన్నికల్లో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కు చెందిన జన్ సురాజ్ పార్టీ అట్టర్ ఫ్లాప్ షో కనిపించింది. ప్రారంభ ఫలితాల్లో ఆ పార్టీ ఎక్కడ కూడా ఆధిక్యతలో లేదు. ఫలితాలు వెలువడుతున్న కొద్దీ రెండు చోట్ల మాత్రమే జన్ సురాజ్ అభ్యర్థులు లీడింగ్ సాధించగలిగారే గానీ అది కూడా 1,000 నుంచి 2,000 ఓట్ల లోపే. కౌంటింగ్ కొనసాగుతున్న వాళ్ల మెజారిటీ తగ్గుతూ వస్తోంది కూడా. అదే సమయంలో పలు కీలక నియోజకవర్గాల్లో ఓట్లను చీల్చగలిగారు.
చంపాటియా స్థానంలో మనీష్ కశ్యప్, కర్గాహర్ లో రితేష్ పాండే తమ సమీప ప్రత్యర్థులపై ఆధిక్యతను సాధించారు. మొత్తం జన్ సూరాజ్ పార్టీ 243 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది గానీ.. ఎక్కడ కూడా భారీ మెజారిటీ అనేది సాధించట్లేదు. దాదాపు 15 నియోజకవర్గాల్లో మాత్రమే కాస్తంత బలమైన పోటీని ఇస్తోంది. ఎగ్జిట్ పోల్స్ కూడా ప్రశాంత్ కిషోర్‌కు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదనే విషయం తెలిసిందే. ఆయనకు అనుకూలంగా ఏ ఒక్కటీ వెలువడలేదు. చాలా సర్వేలు మొత్తం రెండు మూడు సీట్లు మాత్రమే గెలుస్తుందని అంచనా వేశాయి.












Click it and Unblock the Notifications