గాంధీ స్వదేశానికి వచ్చి 100 ఏళ్లు: రాజ్‌నాథ్, పక్కనే ఏపీ సీఎం బాబు (ఫోటోలు)

గాంధీ నగర్: జాతిపిత మహాత్మా గాంధీ స్పూర్తితో ప్రవాస భారతీయులు దేశాభివృద్ధికి సహకరించాలని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. గుజరాత్‌లో మూడోరోజు జరుగుతున్న ప్రవాసీ భారతీయ దివస్‌కు శుక్రవారం రాజ్ నాథ్ సింగ్ హాజరయ్యారు.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ దక్షిణాఫ్రికాకు వెళ్లిన మహాత్మాగాంధీ తిరిగి స్వదేశానికి వచ్చి శుక్రవారానికి (జనవరి-9)తో 100ఏళ్లు అయ్యిందని గుర్తు చేశారు. మన దేశానికి రాజకీయ స్వేచ్ఛ ఎందుకు కావాలో ఆనాడే మహాత్మ గాంధీ వివరించారని చెప్పారు.

దేశంలో సామాజిక, ఆర్థిక పరివర్తన కోసం స్వాతంత్య్రం అవసరమని వాటితో పాటుగా సాంస్కృతిక పునరుజ్జీవం కూడా జరగాలని గాంధీజీ వివరించారని మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ చెప్పారు. మోడీ ప్రభుత్వం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయుల పెట్టుబడుల కోసం ఎదురు చూడటం లేదని, వారితో అనురాగ బంధం కోసం ఎదురుచూస్తోందని అన్నారు.

ప్రవాస భారతీయులతో ధన సంబంధం కాదు, మనస్సుతో కూడిన సంబంధం ఏర్పరుచుకోవాలని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. మేము సొంతంగా ఒక బలమైన భారతదేశాన్ని సృష్టించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని అది మీ సహకారం లేకుండా సాధ్యపడని అన్నారు.

ప్రణాళికా సంఘం ప్లేసులో కొత్తగా ప్రవేశపెట్టిన నీతి ఆయోగ్ కూడా మంచి ఫలితాలు సాధించడానికి రాష్ట్రాలు క్రియాశీలక పాత్రను పోషించనున్నాయని పేర్కొన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశ సమాఖ్య నిర్మాణం భిన్నమైనది. మన సమాఖ్య నిర్మాణం పోటీతత్వంతో కాకుండా సహాకారంతో ముందుకు సాగాలని సూచించారు.

ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు దేశవ్యాప్తంగా 10 మంది ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు ప్రవాసి భారతీయ దివస్‌లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వనరులు, పెట్టుబడి అవకాశాలపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చారు.

 ప్రవాసీ భారతీయ దివస్‌లో మూడో రోజు విశేషాలు

ప్రవాసీ భారతీయ దివస్‌లో మూడో రోజు విశేషాలు

గుజరాత్‌లో మూడోరోజు జరుగుతున్న ప్రవాసీ భారతీయ దివస్‌కు శుక్రవారం రాజ్ నాథ్ సింగ్ హాజరయ్యారు. పక్కన కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, పంజాబ్, గుజరాత్ ముఖ్యమంత్రులు వరుసగా ప్రకాశ్ సింగ్ బాదల్, ఆనందీ బెన్ పటేల్.

ప్రవాసీ భారతీయ దివస్‌లో మూడో రోజు విశేషాలు

ప్రవాసీ భారతీయ దివస్‌లో మూడో రోజు విశేషాలు

గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో జరుగుతున్న ప్రవాసీ భారతీయ దివస్‌కు 10 రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు హాజరయ్యారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో రాజ్ నాథ్ మంతనాలు. పంజాబ్, గుజరాత్, హర్యానా ముఖ్యమంత్రులు వరుసగా ప్రకాశ్ సింగ్ బాదల్, ఆనందీ బెన్ పటేల్, ఖట్టర్.

ప్రవాసీ భారతీయ దివస్‌లో మూడో రోజు విశేషాలు

ప్రవాసీ భారతీయ దివస్‌లో మూడో రోజు విశేషాలు

గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో మూడోరోజు జరుగుతున్న ప్రవాసీ భారతీయ దివస్‌కు 10 రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు హాజరయ్యారు. స్టేజిపై వరుసగా మహారాష్ట్ర సీఎం ఫఢ్నవీస్, హార్యానా సీఎం ఖట్టర్, గుజరాత్ సీఎం ఆనందీ బెన్ పటేల్, పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్, హొం మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, జార్ఖండ్ సీఎం రఘువర్ దాస్, కేరళ సీఎం ఉమెన్ చాందీ.

గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో మూడోరోజు జరుగుతున్న ప్రవాసీ భారతీయ దివస్‌కు 10 రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు హాజరయ్యారు. మహారాష్ట్ర సీఎం ఫఢ్నవీస్‌కు నమస్కరిస్తున్న మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+