వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ మానియా: ఢిల్లీలో బీజేపీకి 40 సీట్ల వరకు, సీఎంగా కేజ్రీవాల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి ఏడో తేదీన జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రీ పోల్ సర్వేలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎక్కువ మంది దేశ రాజధాని ఢిల్లీ ఓటర్లు ఓటు వేశారు. అదే సమయంలో, మెజార్టీ మాత్రం భారతీయ జనతా పార్టీకి ఇస్తామని చెప్పారు.

ఇండియా టుడే-సిసిరో ఒపీనియన్ పోల్ నిర్వహించింది. ప్రీపోల్ సర్వేలో.. భారతీయ జనతా పార్టీకి 40 శాతం ఓట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి 36 శాతం ఓట్లు వస్తాయని తేలింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా కోలుకోలేని పరిస్థితిలోనే ఉంది. ఆ పార్టీకి కేవలం 16 శాతం మాత్రమే ఓటేశారు.

ఈ సర్వే ప్రకారం... బీజేపీ 34-40 సీట్లు, ఏఏపీ 25-31 సీట్లు, కాంగ్రెస్ పార్టీ 3-5 సీట్లు గెలుచుకోనుంది. ఇతరులు రెండు సీట్లు గెలుచుకుంటారు. ఢిల్లీలో 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 70 నియోజకవర్గాలలోని 210 పోలింగ్ బూత్‌లలో 4,459 మంది నుండి అభిప్రాయం తీసుకున్నారు.

Pre-poll survey: Majority for BJP, but Arvind Kejriwal top pick for CM

ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ బెస్ట్

ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అరవింద్ కేజ్రీవాల్‌కు 35 శాతం మంది ఓటేశారు. కాగా, ఇప్పుడు కేంద్రమంత్రిగా ఉన్న హర్షవర్ధన్‌కు 23 శాతం మంది ఓటేశారు. షీలాదీక్షిత్‌కు కేవలం తొమ్మిది శాతం మంది మాత్రమే మద్దతు పలికారు.

కాగా, ఢిల్లీలోని 70 నియోజకవర్గాలలో ఫిబ్రవరి 7న ఎన్నికలు జరుగుతాయి. 10వ తేదీన ఫలితాలు ఉంటాయి. ఢిల్లీలోని డెబ్బై అసెంబ్లీ స్థానాల్లో 1.3 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 11,763 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ 32, ఏఏపీ 27, కాంగ్రెస్ 15 సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్ మద్దతుతో కేజ్రీవాల్ 49 రోజులు పాలించారు. అనంతరం రాష్ట్రపతి పాలన వచ్చింది.

English summary
The February 7 Delhi assembly elections is going to witness a tough fight between AAP and BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X