వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైలులో కచ్చితంగా చనిపోతా, కానీ ఆస్పత్రికి వెళ్లను -బెయిల్ కోసం 84ఏళ్ల స్టాన్ స్వామి హృదయవిదారక అభ్యర్థన

|
Google Oneindia TeluguNews

''ఎనిమిది నెలల కిందట నన్ను ఈ జైలుకు తీసుకొచ్చినప్పుడు నా వయసు రీత్యా యాక్టివ్ గా ఉండేవాడిని. స్నానం చేయడం, నాలుగడుగులు నడవటం, కొంత సేపు రాత, పుస్తక పఠనం, చేత్తో అన్నం తినడం లాంటివి చేతనయ్యేవి. కానీ రోజులు గడుస్తున్నకొద్దీ ఈ జైలు నన్ను నిశ్చేష్టుడిని చేసింది. ఇప్పుడు నేను సొంతగా స్నానం కాదుకదా, అన్నం కూడా తినలేని దుస్థితి. ప్రతిదానికీ ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. ఇలా ఎందుకు జరిగిందో దయగల కోర్టువారు దర్యాప్తు చేయించగలరా? ఇక్కడే జైలులోనే ఉండిపోతే ఇంకాస్త క్షీణించి కచ్చితంగా చనిపోతాను. కానీ..

తొలి వైట్ ఫంగస్ కేసు: కొవిడ్ నుంచి కోలుకున్న 70ఏళ్ల వృద్ధుడిలో గుర్తింపు -అలర్ట్ జారీచేసిన డాక్టర్లుతొలి వైట్ ఫంగస్ కేసు: కొవిడ్ నుంచి కోలుకున్న 70ఏళ్ల వృద్ధుడిలో గుర్తింపు -అలర్ట్ జారీచేసిన డాక్టర్లు

ఆస్పత్రిలో మాత్రం నేను చేరబోను. ఎందుకంటే ప్రభుత్వ ఆస్పత్రిలో ఖైదీల కోసం చేసే సెటప్ అంతా నాకు తెలుసు. ఇప్పటికే మూడు సార్లు వెళ్లొచ్చాను. దానికంటే ఇలా జైలు గదిలో కృషించిపోవడానికే నేను సిద్ధంగా ఉన్నాను. నిజానికి నా దుస్థితి రీత్యా ఇది(ఆస్పత్రికి వెళ్లొద్దనేది) అత్యంత కఠినమైన నిర్ణయమే. కానీ ఇప్పుడు వైద్యం కంటే కూడా నాకు నేను ఉండటం చాలా అవసరంగా భావిస్తున్నాను. దయచేసి నన్ను జైలు నుంచి వదిలేయండి. మధ్యంతర బెయిల్ ఇస్తే నా మానాన నేను బతకాలనుకుంటున్నాను... '' అంటూ వణుకుతున్న స్వరంతోనే కచ్చితమైన వాదనను జడ్జికి వినిపించారు 84 ఏళ్ల ఫాదర్ స్టాన్ స్వామి.

Prefer to suffer and die in jail than go to Hospital, Father Stan Swamy seeks bail with Bombay HC

దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన భీమా కోరేగావ్ -ఎల్గర్ పరిషత్ కేసుల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద అరెస్టయినవారిలో ఫాదర్ స్టాన్ స్వామి ఒకరని తెలిసిదే. రాంచీ(జార్ఖండ్)కు చెందిన ఈ 84 ఏళ్ల వృద్ధుడు ప్రస్తుతం తలోజా జైలు(ముంబై)లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కొవిడ్ కారణంగా భీమా కోరేగావ్ కేసుల విచారణ నిదానంగా సాగుతుండగా, జైలులో స్టాన్ స్వామి ఆరోగ్యం క్రమంగా క్షీణించి, దాదాపు అవసాన దశకు చేరింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో అవకాశం ఉన్న ఖైదీలందరినీ పెరోల్, బెయిల్ పై విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన దరిమిలా ఫాదర్ స్టాన్ స్వామిపై బాంబే హైకోర్టులో కీలక వాదనలు జరిగాయి..

షాకింగ్: ప్రధాని మోదీ కన్నీరు -కొవిడ్ మరణాలపై భావోద్వేగం -మహమ్మారితో పోరు సుదీర్ఘం -వారణాసికి వందనంషాకింగ్: ప్రధాని మోదీ కన్నీరు -కొవిడ్ మరణాలపై భావోద్వేగం -మహమ్మారితో పోరు సుదీర్ఘం -వారణాసికి వందనం

స్టాన్ స్వామి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుండటంతో మధ్యంతర బెయిల్ కోసం అభ్యర్థించారు. బాంబే హైకోర్టు జస్టిస్‌ ఎస్‌జె ఖతావాలా, ఎస్‌పి తవడేతో కూడిన వెకేషనల్‌ బెంచ్‌ ఈ పిటిషన్ ను విచారిస్తున్నది. బుధవారం నాటి విచారణలో.. స్టాన్ స్వామి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన జడ్జిలు.. ఆయనను వెంటనే జేజే ఆస్పత్రికి తరలించి టెస్టులు చేసి, అక్కడే ఉంచి చికిత్స అందించే అవకాశాలను పరిశీలించాలని అధికారుల్ని ఆదేశించింది. ఆ మేరకు టెస్టులు జరిగినప్పటికీ, మళ్లీ జైలుకే తిరిగొచ్చిన ఫాదర్ స్టాన్ స్వామి.. తాను ఆస్పత్రిలో చేరబోనని, మధ్యంతర బెయిల్ మాత్రమే కోరుతున్నానని జడ్జిలకు విన్నవించుకున్నారు. వినికిడి శక్తిని కోల్పోయిన స్టాన్ స్వామి.. సహాయకుడి సాయంతో జడ్జితో వర్చువల్ గా మాట్లాడారు. ఆస్పత్రికి వెళ్లడం కంటే జైలులోనే చస్తానన్న ఆయన.. బెయిల్ పై మాత్రమే విచారణ చేయాలని కోర్టును వేడుకున్నారు. వెంటనే బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన బాంబే హైకోర్టు 84 ఏళ్ల స్టాన్ స్వామి కేసును జూన్ 7కు వాయిదా వేసింది. సందర్భాలు, కేసులు వేర్వేరు అయినప్పటికీ, స్టాన్ స్వామిలాగే దేశద్రోహం ఆరోపణలపై అరెస్టయిన వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు మాత్రం సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేయడం గమనార్హం.

English summary
Father Stan Swamy, an 84-year-old tribal rights activist, who is an undertrial in in the Bhima Koregaon- Elgar Parishad case, pleaded with the Bombay High Court to grant him interim bail to go back to his home in Ranchi. He told a division bench led by Justice SJ Kathawalla that his health has progressively deteriorated in the eight months he has spent a Taloja Prison. Adding that being in Taloja has brought him to a situation where he can neither eat, write, bathe or go for a walk by himself. Swamy asked the court to consider how this happened. He, however, refused to get admitted to the State-run JJ Hospital, saying that he would prefer the Taloja Prison ward where he's lodged since his arrest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X