Coronavirus: దుబాయ్ నుంచి వచ్చిన మహిళ, కడుపులోనే బిడ్డ మృతి, పొట్టన పెట్టుకున్నారు !
బెంగళూరు/మంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బ వలన ఎవ్వరి ప్రాణాలు ఎలా పోతున్నాయో చెప్పడం సాధ్యం కావడం లేదు. లాక్ డౌన్ సందర్బంగా దుబాయ్ నుంచి భారత్ చేరుకున్న నిండు గర్బిణి కొందరు మూర్ఖుల వలన ఆమె కడుపులోనే బిడ్డను పోగుట్టుకుని ఆర్తనాదాలు చేసింది. కడుపులో బిడ్డ చనిపోవడంతో సరైన వైద్యం అందక ఆ మహిళ ఇప్పుడు మృత్యువుతో పోరాడుతున్నది. కడుపులో బిడ్డ చనిపోవడానికి మహిళ నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ నివాసులు, వైద్యులు కారణం అయ్యారని ఆరోపిస్తూ అధికారులు వారికి నోటీసులు జారీ చేశారు.

దుబాయ్ టూ మంగళూరు
కర్ణాటకలోని మంగళూరుకు చెందిన మహిళ దుబాయ్ లో ఉంటున్నది. కరోనా వైరస్ లాక్ డౌన్ దెబ్బకు విదేశాల్లో ఉంటున్న వారు అక్కడే ఉండిపోయారు. మంగళూరుకు చెందిన ఆ మహిళ నిండు గర్బిణి. వందే భారత్ మిషన్ లో భాగంగా ఆ మహిళ మే 12వ తేదీన ప్రత్యేక విమానంలో మంగళూరు నగరానికి చేరుకుంది.

హోమ్ క్వారంటైన్ కు ఓకే
దుబాయ్ నుంచి మంగళూరు చేరుకున్న గర్బిణికి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు కరోనా వైరస్ చికిత్సలు చేశారు. మంగళూరులోని సొంత అపార్ట్ మెంట్ లో ఆ మహిళ హోమ్ క్వారంటైన్ లో ఉండటానికి ప్రభుత్వ అధికారులు, వైద్య శాఖ అధికారులు అనుమతి ఇచ్చారు.

కనికరం లేకుండా గెంటేశారు
గర్బిణి మహిళ నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లో ఆమె ఉండటానికి అదే అపార్ట్ మెంట్ ఫ్లాట్స్ లో నివాసం ఉంటున్న వారు, అపార్ట్ మెంట్ అసోసియేషన్ కమిటీ నిర్వహకులు నిరాకరించారు. అపార్ట్ మెంట్ గేట్ లోపలకి ఆ మహిళను అనుమతించలేదు. చివరికి ఆ మహిళ ప్రైవేటు ఆసుపత్రిలోని క్వారంటైన్ లో ఉండటానికి ప్రయత్నించారు. అయితే ఏ ప్రైవేట్ ఆసుపత్రి సైతం ఆ మహిళకు చికిత్స చెయ్యడానికి నిరాకరించారు. తరువాత మహిళ ఓ ప్రైవేట్ హోటల్ లో ఉంటున్నది.

కడుపులోనే బిడ్డ ప్రాణం పోయింది
సొంత అపార్ట్ మెంట్ లో నివాసం ఉండటానికి అపార్ట్ మెంట్ అసోసియేషన్ కమిటీ నిర్వహకులు నిరాకరించడం, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చెయ్యడానికి నిరాకరించడంతో ఆ మహిళ నరకం అనుభవించింది. చివరికి ఆ మహిళ కడుపులో పెరుగుతున్న బిడ్డకు సరైన వైద్యం అందకపోవడంతో ఆ బిడ్డ కడుపులోనే చనిపోయిందని ఆమె అత్త విలపించారు.

మృత్యువుతో పోరాడుతున్న తల్లి
సరైన వైద్యం అందకపోవడం వలనే మహిళ కడుపులో బిడ్డ చనిపోయిందని, ప్రస్తుతం ప్రైవేటు హోటల్ లో తాము ఉంటున్నామని ఆ మహిళ అత్త వాపోయింది. కడుపులోనే బిడ్డ చనిపోవడంతో తల్లికి తీవ్రస్థాయిలో రక్తం పోయిందని, ఆమె కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడుతున్నదని ఆమె అత్త విలపిస్తున్నారు.

నీచులకు నోటీసులు
మహిళ కడుపులోనే బిడ్డ చనిపోవడానికి అపార్ట్ మెంట్ అసోసియేషన్ నిర్వహకులు, ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు కారణం అయ్యారని తెలుసుకున్న మంగళూరు సిటీ కార్పోరేషన్ కమిషనర్ వారికి నోటీసులు జారీ చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన మహిళ కారణంగా తమకు ఎక్కడ కరోనా వైరస్ సోకుతుందో అనే భయంతో వారు ఇక్కడ నివాసం ఉండటానికి తాము నిరాకరించామని అపార్ట్ మెంట్ అసోసియేషన్ నిర్వహకులు అంటున్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications