ప్రోటోకాల్‌ను పక్కన పెట్టి మోడీ... విపక్షాల విమర్శలు (ఫోటో)

న్యూఢిల్లీ: ఇతర దేశాలతో విదేశాంగ విధానాలు అమలు చేయడంలో గత ప్రధానమంత్రులతో పోలిస్తే... నరేంద్రమోడీ కాస్తంత విభిన్న మార్గంలో వెళుతున్నారు. భారత పర్యటనకు వచ్చిన ఒబామా దంపతులకు ప్రోటోకాల్‌ను పక్కన పెట్టి స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ విమానం వద్దకు వచ్చి మరీ స్వాగతం పలికిన విషయం తెలిసిందే.

ప్రోటోకాల్ ప్రకారం ఒబామాకు స్వాగతం పలికేందుకు ఆయన వెళ్లాల్సిన అవసరం లేదు. విదేశాంగ మంత్రి, ముఖ్య అధికారులు మాత్రం వెళితే సరిపోతుంది. కానీ సాంప్రదాయాలను కాదని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ వెళ్లి స్వాగతం పలకడం వెనకు అమెరికాతో భారత్ మరింత బలమైన బంధాన్ని కోరుకుంటున్న సంకేతాల దిశగా ప్రపంచ దేశాలకు వెళ్లాయి.

President Barack Obama honoured to be back in India, says White House

ఐతే, విపక్షాలు మాత్రం భారతదేశ సౌర్వభౌమతాన్ని అమెరికా ముందు తాకట్టు పెడుతున్నారని విమర్శించాయి. ఆదివారం ఉదయం 9:40 నిమిషాలకు ఢిల్లీలోని పాలెం విమానాశ్రయంలో దిగిన ఒబామా దంపతులు ద బీస్ట్ వాహనంలో ఐటీసీ మౌర్య హోటల్‌కు చేరుకున్నారు.

ఈరోజు మధ్యాహ్నాం హైదరాబాద్ హౌస్‌లో జరగనున్న కీలక సమావేశంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పాల్గొంటారు. ఈ సమావేశంలో భారత్ - అమెరికా మధ్య న్యూక్లియర్, ఢిఫెన్స్‌కు సంబంధించి ఇరు దేశాధినేతలు చర్చిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+