మహిళలకు నైట్ షిప్టులు: రాష్ట్రపతి ఆమోదం
ముంబై: ఇక నుంచి ఫ్యాక్టరీలు, ఇతర సంస్థల్లో రాత్రి వేళలో కూడా మహిళలు పనిచేసేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వ ఫ్యాక్టరీ చట్టం, 1948కి చేసిన సవరణకు ఆయన ఆమోదం తెలిపారు.
దీంతో ఇకపై మహారాష్ట్ర మహిళలు రాత్రి వేళలో కూడా పనిచేసేందుకు అవకాశం లభించింది. అంతకుముందు ఇదే చట్టంలోని 66(1)(సీ) అనే నిబంధన రాత్రి 7గంటల నుంచి ఉదయం 6గంటల మధ్యకాలంలో మహిళలను ఫ్యాక్టరీలు ఇతర సంస్థల్లో పనిచేసేందుకు అనుమతిచ్చేది కాదు.

అయితే, దానికి ఇటీవలే ఆ రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేసి రాష్ట్రపతికి పంపించగా ఆయన ఆమోద ముద్ర వేశారు. ఈ సవరణ చట్టంలో రాత్రి వేళలో పనిచేసే మహిళల భద్రతకు సంస్థ యాజమాన్యాలే బాధ్యత వహించాలని కూడా స్పష్టంగా పేర్కొన్నాయి.












Click it and Unblock the Notifications