• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సంచలన నిర్ణయాలు తప్పలేదు: పార్లమెంటులో రాష్ట్రపతి ప్రణబ్

|

న్యూఢిల్లీ: సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ మన లక్ష్యమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు.

ఉభయసభలను ఉద్దేశించి ఆయన మంగళవారం ఉదయం పార్లమెంటులో ఆయన ప్రసంగించారు. స్వాతంత్ర్య భారతదేశంలో ఇవి చారిత్రాత్మక సమావేశాలని ఆయన అన్నారు. తొలిసారిగా సాధారణ బడ్జెట్‌లోనే రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం జరుగుతోందని అన్నారు. స్వచ్ఛ భారత్‌లో ప్రజల భాగస్వామ్యానికి సెల్యూట్ అని అన్నారు.

ప్రజా సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నామని ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. అవినీతి, నల్లధనం, ఉగ్రవాదం, నకిలీ నోట్ల నిర్మూలనకే పెద్ద నోట్ల రద్దు అని స్పష్టం చేశారు. విదేశాల్లోని నల్లధనంపై సిట్ వేసినట్లు తెలిపారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమల్లోకి తెచ్చామని, దీంతో రిటైర్డ్ సైనికోద్యోగుల 4దశాబ్దాల కల సాకారమైందని రాష్ట్రపతి చెప్పారు. అంతేగాక, 2016, సెప్టెంబర్ 29న సర్జికల్ స్ట్రైక్స్‌ను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు.

పీవీ సింధు, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్‌లు మహిళా శక్తిని చాటారని రాష్ట్రపతి ప్రశంసించారు. అంధుల వరల్డ్ కప్, పారాఒలింపిక్స్ విజేతలకు ప్రణబ్ అభినందనలు తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'బేటీ బచావో బేటీ పడావో' బాలికలకు రక్షగా ఉంటుందోని చెప్పారు.

President Pranab Mukherjee's Speech At Parliament's Budget Session

దేశంలో బ్లాక్ మనీ గణనీయంగా తగ్గిపోయిందని అన్నారు. అవినీతి, నల్లధనం నిర్మూలనకు ప్రజలు సహకరించారని అన్నారు. అవినతి నిర్మూలను అనేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఇప్పటికే 26కోట్ల మందికి జన్ ధన్ ఖాతాలు తెరిపించామని చెప్పారు. ఇండియన్ పోస్టల్ చెల్లింపుల బ్యాంకును ప్రారంభించామని తెలిపారు.

డిజిటలైజేషన్ లో భాగంగా కార్డులు అందజేయడం జరిగిందని ప్రణబ్ చెప్పారు. రైతులకు భూసార కార్డులు, కిసాన్ క్రెడిట్, రూపే కార్డులను అందజేయడం జరుగుతోందిన తెలిపారు. ప్రధాని కృషి సంచాయ్ యోజనతో ప్రతీ ఎకరాకుల నీరు అందించడం జరుగుతుందని చెప్పారు.

చంపారన్ ఉద్యమానికి వందేళ్లు పూర్తయ్యాయని చెప్పిన రాష్ట్రపతి.. ఇది ప్రజా ఉద్యమ బలాన్ని చాటిందని చెప్పారు. ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఉపాధి, ఉద్యోక కల్పన కోసం రూ. 6వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

స్కిల్ డెవలప్‌మెంట్ ప్రొగ్రాం ద్వారా యువతలో నైపుణ్యాన్ని పెంచి ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతోందిన అన్నారు. జాతీయ అప్రెంటిస్ పథకంలో 20లక్షల మందికి లబ్ధి చేకూరిందని చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రొగ్రాం ద్వారా యువతలో నైపుణ్యాన్ని పెంచి ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతోందిన అన్నారు.

తక్కువ ధరకే నాణ్యమైన మందులను, వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఎల్ఈడీ లైట్లను వినియోగంలోకి తేవడంతో రూ.10వేల కోట్ల విలువైన విద్యుత్ ఆదా అయిందని చెప్పారు. 2022నాటికి దేశంలోని అందిరికీ ఇల్లు నిర్మించడం జరుగుతుందని తెలిపారు. ప్రసూతి సెలవులను 12 నుంచి 26వారాలకు పెంచామని తెలిపారు.

ఇస్రో ఒకేసారి 20శాటిలైట్లను పంపి కొత్త చరిత్రను సృష్టించిందని అన్నారు. భారత్ నెట్ ద్వారా 70వేల గ్రామాలకు ఇంటర్నెట్ అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ మహిళా పారిశ్రామిక వేత్తలకు ఆర్థిక ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రూ. 490 వెచ్చించినట్లు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రత్యక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈపీఎఫ్‌లో యూనిక్ ఐడీతో లబ్ధిదారులకు ప్రజయోనం చేకూరుతోందని అన్నారు. మిషన్ ఇంధ్రదనుస్సు ద్వారా ప్రతీ చిన్నారికి టీకాలు వేస్తున్నట్లు తెలిపారు.

ఉపాధి హామీ పథకం కింద రూ.47వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. భీమ్ యాప్‌తో డిజిటల్ చెల్లింపులను సులభతరం చేశామని చెప్పారు. కోటి 20లక్షల మంది స్వచ్ఛందంగా గ్యాస్ సబ్సిడీ వదులుకున్నారని, దీంతో దేశంలోని పేదల ప్రజలకు భారీ ఎత్తున గ్యాస్ సబ్సిడీ లభించిందని చెప్పారు. 5కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించినట్లు తెలిపారు.

స్వచ్ఛ భారత్ కింద 3కోట్లకు పైగా టెయ్‌లెట్లు నిర్మించామని తెలిపారు. ప్రధాని ఫసల్ భీమా యోజన కింద పంటలకు బీమా కల్పించడం జరుగుతోందని వివరించారు. 3కోట్ల కిసాన్ కార్డులను రూపే కార్డులుగా మార్చామని తెలిపారు. నాబార్డు నిధిని 40వేల కోట్లకు పెంచామని అన్నారు.

ఒకే దేశం ఒకే పన్ను అమలులో ఉండాలని జీఎస్టీని తీసుకొస్తున్నట్లు తెలిపారు. దీనికి 23రాష్ట్రాల్లో 17 రాష్ట్రాలు ఆమోదించాయని తెలిపారు. దేశంలో విదేశీ మారకం రికార్డు స్థాయిలో పెరిగిందని చెప్పారు. రైతులు, కూలీలు, పేదల అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

దేశంలో 2600మంది మావోయిస్టులు లొంగిపోయారని చెప్పారు. ఉగ్రవాదం వల్ల జమ్మూకాశ్మీర్ ఎంతో నష్టపోతుందని అన్నారు. ఉగ్రవాదంపై పోరు కోసం ప్రపంచ దేశాలతో కలిసి ముందుకు సాగుతున్నామని చెప్పారు.

మొరాయించిన మైక్: ప్రణబ్ అసహనం

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగిస్తున్న వేళ, మైకులు మొరాయించడం సభ్యులతో పాటు రాష్ట్రపతికీ అసహనాన్ని కలిగించింది. ఆయన మాట్లాడుతుండగా, మైకుల నుంచి 'గుయ్య్...' మని శబ్ధం పలుమార్లు వచ్చింది. దీంతో చెవులకు ఇయర్ ఫోన్స్ తగిలించుకుని ప్రణబ్ ప్రసంగాన్ని వింటున్న వాళ్లంతా వాటిని పక్కకు తొలగించాల్సి వచ్చింది. ఆపై మరోసారి కూడా ఇలాగే జరిగింది. ఆ సమయంలో ప్రణబ్ అసహనంగా మైక్ సెట్ నిర్వాహకుల వైపు చూశారు. ప్రణబ్ ప్రసంగాన్ని ఆపకుండా కొనసాగించగా, ఆపై కాసేపటికి మైక్ సమస్య తొలగిపోయింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
President Pranab Mukherjee is addressed Parliament in a joint session of both houses as is customary ahead of the budget session which begins today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more