విషమంగా రాష్ట్రపతి భార్య ఆరోగ్యం: ఢిల్లీలో చికిత్స
న్యూఢిల్లీ: అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స్ పొందుతున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి సువ్రా ముఖర్జీ పరిస్ధితి విషమంగా ఉన్నట్లు ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రి అధికారులు తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఆమెను శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చేర్చారు.

"శ్వాసక్రియకు సంబంధించిన సమస్యతో రాష్ట్రపతి భార్యను ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆమె హార్ట్ పేషెంట్. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నాం" అని ఆసుపత్రి అధికార ప్రతినిధి ఒకరు వివరించారు. ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తున్నారు.
అప్పటికే ఒడిశా పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి విషయం తెలిసిన వెంటనే పర్యటనను ముగించుకొని శుక్రవారం సాయంత్రమే ఢిల్లీకి చేరుకున్నారు.












Click it and Unblock the Notifications