మాజీ సీజేఐ రంజన్ గొగోయ్‌ను రాజ్యసభకు నామినేట్ చేసిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌ను రాజ్యసభకు నామినేట్ చేశారు. రాజ్యసభలో ఒక నామినేట్ పోస్టును భర్తీ చేసేందుకు ఈ మేరకు నిర్ణయించిన నేపథ్యంలో కేంద్రం నోటికేషన్ జారీ చేసింది.

గత సంవత్సరం నవంబర్ 17న రంజన్ గొగోయ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి నుంచి పదవీ విరమణ పొందారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అయోధ్య కేసులో ఆయన కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.

జస్టిస్ రంజన్ గొగోయ్ నవంబర్ 18, 1954లో జన్మించారు. ఆయన న్యాయవాద వృత్తి స్వీకరించి బార్ అసోసియేషన్ లో 1978లోనమోదు అయ్యారు. ఆయన గౌహతీ హైకోర్టులో ప్రాక్టీసు చేస్తూ ఫిబ్రవరి 28, 2001 న న్యాయమూర్తి అయ్యారు. ఆయన సెప్టెంబర్ 2010 న పంజాబ్, హర్యానా హైకోర్టుకు బదిలీ కాబడ్డారు. తరువాత ఫిబ్రవరి 12, 2011 న ప్రధాన న్యాయమూర్తి అయ్యారు.
Recommended Video
రంజన్ గొగోయ్ ఏప్రిల్ 23, 2012 న సుప్రీం కోర్టు న్యాయమూర్తి పదవిని స్వీకరించారు. ఆయన తండ్రి "కేశబ్ చంద్ర గొగోయ్" అస్సాం ముఖ్యమంత్రిగా పనిచేసారు. కాగా, ఈశాన్య రాష్ట్రాల నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన తొలి వ్యక్తి ఆయనే కావడం గమనార్హం.












Click it and Unblock the Notifications