కోలీ, అక్కాచెల్లెళ్లు సహా 6గురికి క్షమాభిక్షకు రాష్ట్రపతి నో
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిఠారీ హత్యల కేసులో దోషిగా నిర్ధారించబడిన సురేష్ కోలీతోపాటుగా మరణ శిక్షలను ఎదుర్కొంటున్న మరో ఐదుగురు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్లను రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించారు. కోలీతోపాటు మహారాష్టక్రు చెందిన అక్కాచెల్లెళ్లు రేణుకాబాయి, సీమా, అదే రాష్ట్రానికి చెందిన రాజేంద్ర ప్రహ్లాద్ రావు వాస్నిఖ్, మధ్యప్రదేశ్‌కు చెందిన జగదీష్, అసోంకు చెందిన హోలీరామ్ బోర్డోలిలు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్లను రాష్టప్రతి తిరస్కరించినట్టు అధికార వర్గాలు తెలిపాయి.
వీరి మరణశిక్షలను సుప్రీంకోర్టు సైతం ధ్రువీకరించింది. 42 ఏళ్ల కోలీ ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా సమీపంలోని నిఠారీ ప్రాంతానికి చెందిన పలువురు చిన్నారులను కిడ్నాప్ చేసి వారిపై అత్యాచారం జరిపిన తర్వాత దారుణంగా చంపేసాడు. 2005, 2006 సంవత్సరాల మధ్య తన యజమాని మొనిందర్ సింగ్ పంధేర్ నివాసంలో కోలీ ఈ దారుణాలకు పాల్పడ్డాడు.

ఈ సంఘటనలకు సంబంధించి కోలీపై మొత్తం 16కేసులు నమోదు కాగా నాలుగు కేసుల్లో కోర్టు అతనికి మరణశిక్ష విధించగా, మిగతా కేసులు ఇంకా విచారణలో ఉన్నాయి. అక్కా చెల్లెళ్లయిన రేణుకాబాయ్, సీమాలు తమ తల్లి, కిరణ్ షిండే అనే సహచరుడి తోడ్పాటుతో 1990, 96 మధ్య 13మంది పిల్లలను కిడ్నాప్ చేసి వారిలో తొమ్మిది మందిని చంపేశారు. అయితే ప్రాసిక్యూషన్ అయిదు హత్యలను మాత్రమే నిరూపించగలిగింది.
కాగా, మహారాష్ట్రలోని ఆస్రా గ్రామంలో ఒక చిన్నారిపై అత్యాచారం జరిపి తర్వాత బాలికను దారుణంగా చంపేసిన కేసులో వాస్నిక్‌కు ట్రయల్ కోర్టు మరణ శిక్ష విధించింది. భార్య, అయిదుగురు బిడ్డలను దారుణంగా చంపినందుకు జగదీశ్ మరణ శిక్షను ఎదుర్కొంటుండగా, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని పట్టపగలు దారుణంగా హత్య చేసినందుకు అసోంకు చెందిన బోర్డోలికి కిందికోర్టు మరణ శిక్ష విధించింది.












Click it and Unblock the Notifications