మానవత్వం చూపిన రాష్ట్రపతి తనయుడు

పశ్చిమ బెంగాల్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనయుడు, పార్లమెంట్ సభ్యుడు అభిజిత్ ముఖర్జీ మానవత్వం చూపి పలువురి దగ్గర ప్రశంసలు అందుకుంటున్నారు. ఓ మహిళ ప్రాణాలు కాపాడటానికి శక్తి వంచన లేకుండా కృషి చేశారు.

ఆదివారం సుమితాపాల్ అనే మహిళ కుమారుడు ఆర్యతో కలిసి బైక్ లో బురద్వాన్ నుంచి గస్కరాలోని ఓఆలయంలో పూజలు చెయ్యడానికి బయలుదేరారు. మార్గం మద్యలోని నిర్జనప్రదేశంలో బైక్ అదుపుతప్పడంతో సుమితాపాల్ కిందపడిపోయారు.

ఆమె తలకు తీవ్రగాయాలైనాయి. నిర్జనప్రదేశం కావడంతో సుమితాపాల్ కుమారుడు ఆర్య సైతం ఏమి చెయ్యలేక విలపించాడు. అదే సమయంలో అభిజిత్ ముఖర్జీ కారులో అటువైపు వెళ్లారు. విషయం గుర్తించి సుమితాపాల్ ను ఆయన కారులోనే గస్కరా ఆసుపత్రికి తరలించారు.

President son helps accident victim in Burdwan

అక్కడ ఆమెకు ప్రథమ చికిత్స చేయించారు. తరువాత బురద్వాన్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారని అక్కడి వైద్యులు సూచించారు. అభిజిత్ ముఖర్జీ స్వయంగా అంబులెన్స్ పిలిపించారు. సుమితాపాల్ కుమారుడి చేతికి కొంత నగదు ఇచ్చారు.

బురద్వాన్ జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి సుమితాపాల్ కు మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ఆమెను ఆసుపత్రి నుంచి తీసుకు వెళ్లే వరకు అక్కడే ఉన్నారు. ప్రమాద బాధితురాలిని స్వయంగా ఆసుపత్రికి తీసుకు వెళ్లిన అభిజిత్ ముఖర్జీని పలువురు ప్రశంసించారు.

ముర్షిదాబాద్ లోని జంగీపూర్ లోక్ సభ నియోజక వర్గం నుంచి అభిజిత్ ముఖర్జీ గెలుపోందారు. తాను ఓ సాటి మనిషిగా ఆ మహిళకు సహాయం చేశానని, తాను ప్రత్యేకంగా చేసింది ఏమి లేదని అభిజిత్ ముఖర్జీ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+