ప్రెస్టిట్యూట్: మంచిని విస్మరిస్తోందని మీడియాపై మోడీ, వికె సింగ్‌కు ప్రశంస

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మాజీ జనరల్ వికె సింగ్‌పై ప్రశంసలు కురిపించారు. ఇటీవల ప్రెస్టిట్యూట్ అని మీడియాపై ఆరోపణలు చేసిన వికె సింగ్.. విమర్శలపాలైన విషయం తెలిసిందే. కాగా, తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను మీడియా ప్రధానంగా ప్రసారం చేయడం లేదని మోడీ మీడియాపై మండిపడ్డారు.

‘వికె సింగ్‌కు సెల్యూట్ చేస్తున్నా. ఆయన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌తో కలిసి సంక్షోభంలో ఉన్న యెమన్ నుంచి భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చారు' అని ప్రధాని కొనియాడారు. భాతర రెస్క్యూ మిషన్‌పై ప్రపంచ మీడియా ప్రశంసించినప్పటికీ భారత మీడియా మాత్రం ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని అన్నారు.

మంచి పనులను మీడియా విస్మరిస్తోందని ప్రధాని మోడీ న్నారు. పెస్టిట్యూట్స్ అనే పదాన్ని వాడిన సమయంలో విమర్శలు గుప్పించిన మీడియా.. ఆయన భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చిన్న మంచి పనిని మాత్రం పట్టించుకోలేదని అన్నారు.

‘మీరు ఊహించగలరా? యెమన్‌లో 24పాటు నిరంతరం బాంబుల దాడి జరుగుతున్న సమయంలో, ప్రాణాలు అరచేతిలో పట్టుకున్న మన ప్రజల కోసం అక్కడికి వెళ్లి చాలా దేశాలతో మాట్లాడి, 2 రెండు గంటలపాటు సమయం కోరి వారందరిని సురక్షితంగా తీసుకొచ్చారు. ఇదేమీ చిన్న ఘటన కాదు' అని అన్నారు.

Narendra Modi

‘తమ ప్రజలను కాపాడుకునేందుకు ప్రభుత్వానికి చెందిన మంత్రి ఒక సైనికులా యుద్ధభూమిలో నిలబడటం ప్రపంచంలో ఇదే తొలిసారి. నేను జనరల్ వికెట్ సింగ్‌కు సెల్యూట్ చేస్తున్నా' అని బిజెపి ఎంపీల సమావేశంలో మోడీ పేర్కొన్నారు.

ఇదే సమయంలో భారత మీడియాపై మోడీ మండిపడ్డారు. ‘ప్రపంచంలోని టీవీ ఛానళ్లు, న్యూస్ పేపర్లు చూడండి. యెమన్‌లో భారత రెస్క్యూ బృందం ప్రజలను ఎలా కాపాడిందో ప్రసారం చేసింది. భారత న్యూస్ పేపర్లు మాత్రం అంత అయిపోయాక కొన్ని కారణాల ప్రసారం చేశాయి' అని అన్నారు.

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌పై కూడా ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. ఆమె నేతృత్వంలో పని చేసిన విధంగా ఆ శాఖ ఇంతవరకు ఎప్పుడూ పని చేయలేదని అన్నారు. ‘ఎవరైనా కష్టాల్లో ఉండి అర్ధరాత్రి తర్వాత ఒంటి ప్రాంతంలో ఏదైనా ట్వీట్ చేస్తే.. ఆమె 1.10కే బదులిస్తున్నారు. అంతేగాక, ఎంబసీ కూడా అప్రమత్తం చేయబడుతుంది. ఇంతకుముందు ఏ భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రైనా ఈ విధంగా పని చేశారా?' అని మోడీ ప్రశ్నించారు.

ఇంతగా పని చేసిన సింగ్, స్వరాజ్‌లకు సత్కరించాల్సిన అవసరముందని చెప్పారు. ‘నేను ఇప్పుడు విన్నవించుకుంటున్నా. సురక్షితంగా తమ స్వస్థలాలకు చేరుకున్న వేలాది మంది ప్రజలకు మీపై అమితమైన గౌరవం ఉంటుంది. మీడియా మీ ఫొటోలను ప్రసారం చేయకున్నా మీరు ప్రజల హృదయాలను గెలుచుకున్నారు' అని మోడీ అన్నారు.

కాగా, మోడీ అభినందనలకు కృతజ్ఞతలు తెలిపిన వికె సింగ్.. ‘మీ సమర్థవంతమైన నాయకత్వం లేకుండా మాకు ఈ పని సాధ్యమయ్యేది కాదు' అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+