రేప్ కేసు: కేంద్ర మంత్రి నిహాల్‌చంద్‌పై ఒత్తిడి
హైదరాబాద్: అత్యాచారం కేసులో నిందితుడైన కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రి నిహాల్‌చంద్ మేఘ్వాల్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని తనపై ఒత్తిడి తెస్తున్నారని మంగళవారం బాధితురాలు ఆరోపించింది. నిహాల్‌చంద్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాలని ప్రధాని నరేంద్ర మోడీని కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు ఆమె తెలిపింది.
బాధితురాలు కేంద్ర మంత్రిపై వేలెత్తి చూపుతూ ఆరోపణలు చేస్తూ ఓ టీవీ చానెల్‌లో కనిపించిన నేపథ్యంలో మంత్రి కార్యాలయానికి రాలేదని సమాచారం. హర్యానాకు చెందిన బాధితురాలు కేంద్ర మంత్రి అనుచరులు ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని తనను బెదిరిస్తున్నారని చెప్పింది.

2011లోని అత్యాచారం కేసుకు సంబంధించి కేంద్ర మంత్రికి, మరో 16 మందికి జైపూర్ కోర్టు నోటీసులు జారీ చేసింది. తనకు కొద్ది నిమిషాల సమయం ఇస్తే ప్రధాని నరేంద్ర మోడీకి విషయాన్ని వివరిస్తానని బాధితురాలు అంటోంది.
నరేంద్ర మోడీ మంచి వ్యక్తి అని, మేఘ్వాల్‌ను మంత్రివర్గం నుంచి తప్పించాలని ఆమె అన్నది. మేఘ్వాల్ అనుచరుల ఒత్తిడితో తాను భయానికి లోనై వివిధ గ్రామాలు సంచరిస్తూ తల దాచుకుంటున్నట్లు మహిళ చెప్పింది. తన కుటుంబానికి అధికారులు రక్షణ కల్పించాలని ఆమె డిమాండ్ చేసింది.
కేసులో నిహాల్‌చంద్‌కు ఓ కోర్టు క్లీన్‌చిట్ ఇచ్చిదని, మరో కోర్టు నోటీసులు జారీ చేసిందని, చట్టం తన పని తాను చేసుకుపోయేలా చూడాలని బిజెపి నాయకుడు సిద్ధార్థ్ నాథ్ సింగ్ ఓ న్యూస్ చానెల్‌తో అన్నారు.












Click it and Unblock the Notifications