వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈసారీ బీజేపీ చేతిలో ఓడటం ఖాయం, మాయావతితో ఇదీ లెక్క: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఆందోళన

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి నేతృత్వంలోని బీఎస్పీతో పొత్తు పెట్టుకోవాలని స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు అధిష్టానంపై ఒత్తిడి తీసుకు వస్తున్నారు. అయితే మాయావతి అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోకసభ ఎన్నికల పొత్తుపై ప్యాకేజీ డీల్ అడుగుతున్నారు. దీనికి కాంగ్రెస్ ససేమీరా అంటోంది. అసెంబ్లీకి వేరు, లోకసభ ఎన్నికలకు వేరు అంటోంది. దీంతో చర్చలు మధ్యలో ఆగిపోయాయి.

కాంగ్రెస్ పార్టీని వదిలేసి, అజిత్ జోగి యొక్క జనతా కాంగ్రెస్ చత్తీస్‌గఢ్ (జేసీసీ)తో వెళ్లాలని భావిస్తోంది. ఇది మధ్యప్రదేశ్, మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలను ఆందోళనకు గురి చేస్తోంది. బీఎస్పీతో పొత్తు ఉంటే మనకు లబ్ధి అని లేదంటే నష్టపోతామని కాంగ్రెస్ నాయకులు ఆందోళన చెందుతున్నారు.

బీఎస్పీతో పొత్తు కోసం ఒత్తిడి

బీఎస్పీతో పొత్తు కోసం ఒత్తిడి

ఈ రెండు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలు తమ పార్టీ అధిష్టానంపై బీఎస్పీతో పొత్తు కోసం తీవ్ర ఒత్తిడి తీసుకు వస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో 230 స్థానాలు ఉండగా, ఇప్పటికే మాయావతి 22 మంది అభ్యర్థులను ప్రకటించారు. కొన్ని సీట్లు మనం నష్టపోయినా బీఎస్పీతో కలయికే మంచిదని వారు చెబుతున్నారని తెలుస్తోంది.

మీడియాలో వస్తున్న సమాచారం మేరకు... మాయావతి మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోకసభకు, అలాగే రాజస్థాన్, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర లోకసభ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుపై ఇఫ్పుడే ప్యాకేజీ డీల్ ఉండాలని చెబుతున్నారని అంటున్నారు. దీనికి కాంగ్రెస్ ససేమీరా అంటోంది. ఇక్కడే చర్చలకు బ్రేక్ పడిందని అంటున్నారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు పొత్తు కుదుర్చుకుందామని, లోకసభ ఎన్నికల సమయంలో దాని గురించి ఆలోచిద్దామని కాంగ్రెస్ చెబుతోంది.

కానీ స్థానిక కాంగ్రెస్ నేతలు మాత్రం బీఎస్పీతో పొత్తు కోసం త్వరగా ప్రయత్నాలు పూర్తి చేయాలని ఒత్తిడి తీసుకు వస్తున్నారు. బీఎస్పీ కనుక ఒంటరిగా పోటీ చేస్తే మనకే ఎక్కువ నష్టమని, అప్పుడు బీజేపీకి లబ్ధి చేకూరుతుందని వాపోతున్నారు.

 ఈసారీ ఓడిపోవడం ఖాయం

ఈసారీ ఓడిపోవడం ఖాయం

గత మూడు ఎన్నికల తీరును పరిశీలిస్తే అది అర్థమవుతుందని చెబుతున్నారు. బీఎస్పీ కారణంగానే గత మూడుసార్లు ఓడిపోయామని కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. గతంలో రెండుసార్లు బీఎస్పీతో పొత్తు కోసం ప్రయత్నాలు చేసినా కుదరలేదని అంటున్నారు. ఇప్పుడు కచ్చితంగా బీఎస్పీతో వెళ్లాలని, లేదంటే ఈసారి కూడా బీజేపీ చేతిలో ఓడిపోవడం ఖాయమని ఆందోళన చెందుతున్నారు.

ఏ రకంగా చూసినా 148 సీట్లలో పోటీ చేసినట్లే

ఏ రకంగా చూసినా 148 సీట్లలో పోటీ చేసినట్లే


2013లో బీఎస్పీ 60 స్థానాల్లో 10వేలకు పైగా ఓట్లు సాధించిందని, ఆ అరవై స్థానాల్లో బీజేపీ ఏకంగా 39 సీట్లు గెలుచుకుందని కాంగ్రెస్ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. 230 సీట్లలో 82 సీట్లలో గత మూడు పర్యాయాలు ఒక్కసారి తాము గెలవలేదని గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు బీఎస్పీతో పొత్తు లేకుంటే మరోసారి చేదు అనుభవం తప్పదని అంటున్నారు. గత మూడు పర్యాయాలు గెలవని 82 తీసివేస్తే కాంగ్రెస్ ఏ రకంగా చూసినా 148 స్థానాల్లో పోటీ చేసినట్లే అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 116 సీట్లు అవసరమని చెప్పారు.

 బీఎస్పీ లేకుంటే గెలుపు కష్టమే

బీఎస్పీ లేకుంటే గెలుపు కష్టమే

148 స్థానాలకు గాను కాంగ్రెస్ 116 స్థానాల్లో గెలవడం కష్టమని, అదే సమయంలో బీజేపీ 230 స్థానాల్లో గట్టి పోటీ ఇస్తోందని కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం బీఎస్పీ, ఎస్పీ, గోండ్వానా గణతంత్ర పార్టీ (జీజీపీ)తో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ నుంచి సరైన పొత్తు ప్రయత్నాలు లేవని ఎస్పీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ జాతీయ పార్టీ కాబట్టి పొత్తుపై దానికి బాధ్యత ఎక్కువని అఖిలేష్ యాదవ్ భావిస్తున్నారు. అలాగే, ఎస్పీ కూడా ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు బీఎస్పీ తమ వైపు రావాల్సిందేనని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మజ్లిస్, ప్రకాశ్ అంబేడ్కర్ పార్టీ భారీపా బహుజన్ మహాసంఘ్ (బీబీఎం) పార్టీలు కూడా పొత్తుతో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో కాంగ్రెస్‌కు బీఎస్పీ అవసరం ఉందని అంటున్నారు.

English summary
Talks are stuck as Mayawati wants a package deal, which includes seat-sharing in both assembly and Lok Sabha elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X