Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మొన్న బ్లూమ్‌బెర్గ్.. ఇప్పుడు ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్10 నుండి దిగజారిన అదానీ!!

ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ టెన్ లో ఉన్న గౌతమ్ అదానీ వేగంగా కిందికి పడిపోతున్నారు. బ్లూమ్ బెర్గ్ ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ టెన్ నుంచి కిందికి పడిపోయిన గౌతమ్ అదానీ, ఇప్పుడు ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో కూడా దారుణమైన స్థానానికి పడిపోయారు. నిన్నటి వరకు ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో తొమ్మిదవ స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ ప్రస్తుతం 15వ స్థానానికి పడిపోయి మరింత దిగజారారు.

 ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో దిగజారిన అదానీ స్థానం

ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో దిగజారిన అదానీ స్థానం


అదానీ గ్రూప్ షేర్లు తీవ్ర నష్టాలను చవి చూడడంతో అదానీ సంపద ఆవిరి అవుతుంది. గత నాలుగు రోజులుగా అదానీ గ్రూప్ షేర్లు హిండెన్ బెర్గ్ రిపోర్ట్ తో నష్టాల బాట పట్టాయి. బిలియన్ డాలర్ల అదానీ సంపద అంతా ఆవిరి అయిపోయింది. ఈ క్రమంలో నిన్న మార్కెట్ ముగిసే సమయానికి 75.1 మిలియన్ డాలర్ల సంపదతో గౌతమ్ అదానీ సంపన్నుల జాబితాలో 15వ స్థానానికి పడిపోయారు. అంతకుముందు గౌతమ్ అదానీ కంటే కింద స్థానంలో ఉన్నటువంటి ముఖేష్ అంబానీ ప్రస్తుతం రిచెస్ట్ ఇండియన్ గా ఫోర్బ్స్ జాబితాలో మెరుగైన స్థానాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుతం అదాని 15వ స్థానంలో ఉండగా, ముఖేష్ అంబానీ తొమ్మిదవ స్థానాన్ని దక్కించుకున్నారు.

ఆదానీని వెనక్కు నెట్టి ముందు వరుసలో ముఖేష్ అంబానీ

ఆదానీని వెనక్కు నెట్టి ముందు వరుసలో ముఖేష్ అంబానీ

బుధవారం నాడు కూడా ఆదానీ గ్రూప్ షేర్లు భారీగా నష్టపోయాయి. అదానీ గ్రూప్ కంపెనీలో షేర్లు నష్టాలతో ట్రేడవడంతో అదానీ ప్రపంచ కుబేరుల జాబితా నుంచి మరింత దిగజారి పోయారు. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ విల్ మార్, అదానీ టోటల్ గ్యాస్ నష్టాలతో ట్రేడ్ అయ్యాయి. దీంతో ఫోర్బ్స్ రియల్ టైం కుబేరుల జాబితాలో గౌతమ్ అదానీని వెనక్కి నెట్టి రిలయన్స్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ముందు వరుసలో నిలిచారు. ప్రస్తుతం దేశీయ అత్యంత సంపన్నుడిగా కూడా ముఖేష్ అంబానీ ముందు వరుసలో ఉన్నారు. ఆసియా రిచెస్ట్ పర్సన్ గా కూడా గౌతమ్ అదాని తన స్థానాన్ని కోల్పోయారు.

 ప్రపంచ బిలియనీర్ల జాబితాలో అదానీ స్థానాన్ని తారుమారు చేసిన హిండెన్ బర్గ్ రిపోర్ట్

ప్రపంచ బిలియనీర్ల జాబితాలో అదానీ స్థానాన్ని తారుమారు చేసిన హిండెన్ బర్గ్ రిపోర్ట్


నెల రోజుల క్రితం గౌతమ్ అదానీ ప్రపంచంలోనే మూడవ అత్యంత సంపన్నుడిగా అవతరించిన విషయం తెలిసిందే. ఇక హిండెన్ బర్గ్ నివేదిక గౌతమ్ అదానీ కంపెనీలపై చేసిన ఆరోపణల నేపథ్యంలో అదానీ కంపెనీ షేర్లపై ప్రభావం తీవ్రంగా కనిపించింది. ఫలితంగా అతని నికర సంపద విలువ రోజురోజుకు తగ్గిపోవడం ప్రారంభించింది. దీంతో ఒక్కసారిగా అదానీ ప్రపంచ సంపన్నుల జాబితాలో దారుణమైన స్థానానికి పడిపోయారు. ప్రస్తుతం ఫోర్బ్స్ రియల్ టైం బిలియనీర్ల జాబితాలో ముఖేష్ అంబానీ 84.5 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలో 9వ స్థానంలో ఉంటే, గౌతమ్ అదానీ 75.1 మిలియన్ డాలర్ల సంపదతో 15వ స్థానానికి పడిపోయారు. హిండెన్ బర్గ్ రిపోర్ట్ గౌతమ్ అదానీ స్థానాన్ని బిలియనీర్ల జాబితాలో తారుమారు చేసింది.

 ఫోర్బ్స్ రియల్ టైం జాబితాలో అదానీ స్థానం తారుమారు

ఫోర్బ్స్ రియల్ టైం జాబితాలో అదానీ స్థానం తారుమారు


ఫోర్బ్స్ రియల్ టైం జాబితా ఏ రోజు కా రోజు మారిపోతూ ఉంటుంది. ఈ క్రమంలోనే అదానీ ఆస్తుల నికర విలువ తగ్గిన నేపధ్యంలో రియల్ టైంలో అదానీ క్రిందికి పడిపోయారు. అదానీ కంపెనీల షేర్లు గత కొన్ని రోజులుగా హిండెన్ బర్గ్ నివేదిక కారణంగా నష్టపోతుండటం తెలిసిందే. నెల క్రితం గౌతమ్ అదానీ ప్రపంచంలోనే మూడో అత్యంత సంపన్నుడిగా ఉన్నారు. హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలు అదానీ షేర్లపై ప్రభావం చూపాయి. ఫలితంగా అదానీ నికర సంపద విలువ తగ్గిపోయింది. దీంతో బిలియనీర్ల జాబితాలో స్థానాలు తారుమారయ్యాయి.

 మరో సంచలన నిర్ణయం తీసుకున్న అదానీ.. ఏ స్థానానికి వెళ్తారో?

మరో సంచలన నిర్ణయం తీసుకున్న అదానీ.. ఏ స్థానానికి వెళ్తారో?


ఇక తాజా పరిస్థితుల నేపథ్యంలో గౌతమ్ అదానీ మరొక సంచలనం నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. 20వేల కోట్ల విలువైన షేర్లు ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ ని రద్దు చేస్తున్నట్టు అదానీ ఎంటర్ప్రైజెస్ బుధవారం ప్రకటించింది. హిండెన్ బర్గ్ ఆరోపణలు కొనసాగుతున్న నేపథ్యంలో అదానీ గ్రూప్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. దీని ప్రభావం అదానీ సంస్థల పైన, బిలియనీర్ల జాబితాలో అదానీ స్థానం పైన మరింత చూపించే అవకాశం ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+