హోటల్‌లో గర్భిణితో బద్రీనాథ్ పూజారి అసభ్యత, అరెస్ట్

సోమవారం సాయంత్రం 4.30 ప్రాంతంలో 28 ఏళ్ల గర్భిణీ మహిళను స్థానిక హోటల్‌కు పిలిపించారని, రూమ్‌కు రాగానే కేశవన్ లైంగికంగా వేధించాడని ఆ మహిళ ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు.
కేశవన్‌తో పాటు అతని అనుచరుడు విష్ణుప్రసాద్‌ను కూడా హోటల్ గదిలో అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. అనంతరం వీరిని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా ఈ నెల 18 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. నిందితులిద్దరూ మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు.
వారిద్దరి కస్టడీని పోలీసులు తీసుకోలేదు. ఈ కేసులో వారిద్దరే నిందితులని, ఇక కస్టడీకి తీసుకొని విచారించాల్సిన అవసరం లేదని పోలీసులు కోర్టుకు తెలియజేశారు.
మరోవైపు ఆలయ ప్రధాన పూజారి కేశవన్ నంబూద్రిని సస్పెండ్ చేసినట్లు బద్రీ-కేదార్ ఆలయ కమిటీ చీఫ్ గణేష్ గొడియాల్ వెల్లడించారు. కేశవన్ స్థానంలో విసి ఈశ్వర్ ప్రసాద్ ప్రధాన పూజారి బాధ్యతలను నిర్వహిస్తారని ప్రకటించారు.












Click it and Unblock the Notifications