అమ్మ సమక్షంలోనే మోడీ 66వ పుట్టినరోజు..
అహ్మదాబాద్ : ఈ ఏడాది తన పుట్టినరోజు వేడుకలను స్వరాష్ట్రంలోనే చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ప్రధాని మోడీ. సెప్టెంబర్ 17వ తేదీతో 66వ వడిలోకి అడుగుపెట్టబోతున్న మోడీ.. తన తల్లి చెంతనే పుట్టినరోజును జరుపుకోనున్నారు.
ఇప్పటికే ఖరారైన షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబర్ 17న అహ్మదాబాద్ నుంచి నేరుగా గాంధీనగర్ చేరకుంటారు మోడీ. అక్కడే తల్లి హిరాబాను, కుటుంబ సభ్యులను కలుసుకుని కొద్దిసేపు గడుపుతారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి గిరిజన జిల్లా దాహోద్ కు చేరకుని కదన-హఫేశ్వర్ నీటి ప్రాజెక్టును ప్రారంభిస్తారు.

ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం.. నవ్సరి పట్టణంలోని వికలాంగులను కలుసుకుని వారితో కాసేపు గడుపుతారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, కొద్దిరోజుల వ్యవధిలోనే మోడీ మూడోసారి గుజరాత్ ను సందర్శిస్తుండడం గమనార్హం. తల్లి ఆశీస్సుల కోసం మోడీ గుజరాత్ కు వస్తుండడం పట్ల స్థానిక బీజేపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications