కర్ణాటక విశ్వాస పరీక్ష: జమ్మూలో మోడీ టూర్
న్యూఢిల్లీ: కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి యడ్యూరప్ప విశ్వాస పరీక్ష శనివారం సాయంత్రం నాలుగు గంటలకు జరగనుంది. కర్ణాటక రాష్ట్రం వైపే దేశం యావత్తూ ఆసక్తిగా చూస్తోంది. ఈ తరుణంలో ప్రధానమంత్రి మోడీ ఇవాళ కాశ్మీర్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.
లేహ్, శ్రీనగర్, జమ్మూ సహా జమ్మూ కశ్మీర్‌లోని మూడు ప్రాంతాల్లో ఇవాళ ఆయన పర్యటిస్తున్నారు.. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ట్విటర్లో స్పందించారు. ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది.

నేను జమ్మూ కశ్మీర్‌లోని మూడు ప్రాంతాల్లో పర్యటించనున్నాను. లేహ్‌ను సందర్శించిన తర్వాత, శ్రీనగర్ వెళ్లనున్నాను. తర్వాత జమ్మూలో పర్యటించనున్నట్టు ఆయన పేర్కొన్నారు.
మరోవైపు జమ్మూ కశ్మీర్ వచ్చిన ప్రధాని మోదీకి సీఎం మెహబూబా ముఫ్తీ ఘనస్వాగతం పలికారు. సీఎం ముఫ్తీతో కలిసి ప్రధాని ఇవాళ 19వ కుషోక్ బకులా రింపోచే శతజయంతి ముగింపు వేడుకల్లో పాల్గొనడంతో పాటు లేహ్‌లో జోజి లా సొరంగం పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
I thank the wonderful people of Leh for the warm welcome. I am delighted to be here. pic.twitter.com/XmogPkc64v
— Narendra Modi (@narendramodi) May 19, 2018
అనంతరం జమ్మూలోని హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టును ఆయన ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా జమ్మూ, శ్రీనగర్ మార్గాల్లో పోలీసులు బలగాలు, సీఆర్‌పీఎఫ్ దళాలు పటిష్ట భద్రత ఏర్పాటు చేశాయి.
కర్ణాటక రాష్ట్రంలో విశ్వాస పరీక్షను బిజెపితో సహ అన్నిరాజకీయ పార్టీలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. బిజెపికి చెందిన అగ్రనేతలు కూడ కర్ణాటకలో మకాం వేసి విశ్వాసపరీక్షను పర్యవేక్షిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేతలు కూడ బెంగుళూరులో మకాం వేశారు. యడ్యూరప్పను విశ్వాస పరీక్షలో ఓడించేందుకు వ్యూహాలను రచిస్తున్నారు.












Click it and Unblock the Notifications