ఇప్పుడు మన ఆర్మీ: మోడీ, ఇజ్రాయెల్ తో పోలిక
మాండీ: ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మన సైన్యం గురించి మాట్లాడుకుంటున్నారని, వారి సేవలను గుర్తిస్తున్నారని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మన సైన్యం మీద ప్రశంసల జల్లు కురిపించారు.
పాక్ అక్రిమత కాశ్మీర్ లో భారత ఆర్మీ జరిపిన సర్జికల్ స్ట్రైక్ దాడుల పేరు చెప్పకుండానే మన సైన్యం సత్తాను కొనియాడారు. హిమాచల్ ప్రదేశ్ లోని మాండీలో మంగళవారం జరిగిన బహిరంగ సభలో నరేంద్ర మోడీ మాట్లాడారు.
గతంలో ఇజ్రాయోల్ సైన్యం గురించి ప్రపంచ దేశాలు మాట్లాడుకునేవి. ఇప్పుడు భారత ఆర్మీ గురించి మాట్లాడుకుంటున్నారని నరేంద్ర మోడీ అన్నారు. శత్రు దేశాల్లోని ఉగ్రవాదుల అంతం చూడటానికి గతంలో ఇజ్రాయెల్ సైన్యం సర్జికల్ స్ట్రైక్ దాడులు చేసింది.

ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ఉగ్రవాదులను అంతం చేసిన ఇజ్రాయెల్ సైన్యం వెనుతిరిగింది. ఇప్పుడు ఇజ్రాయెల్ సైన్యానికి బదులు మన సైన్యం గురించి, వారి సత్తా గురించి మాట్లాడుకుంటున్నారని నరేంద్ర మోడీ అన్నారు.
హిమాచల్ ప్రదేశ్ వీరుల జన్మభూమి అని అన్నారు. రాష్ట్రంలో దాదాపు ప్రతి ఇంటిలో ఓ సైనికుడు ఉన్నాడని, మిమ్మల్ని, మీ దేశభక్తిని చూస్తుంటే తనకు చాల సంతోషంగా ఉందని మోడీ చెప్పారు.
దేశంలోని ప్రధాన నగరాల్లో దాడులకు దిగుతున్న ఉగ్రవాదులను ఏరివేసేందుకు పాకిస్థాన్ అక్రమిత కాశ్మీర్ లోకి వెళ్లి సర్జికల్ స్ట్రైక్ దాడులు చెయ్యడానికి భారత ఆర్మీకి ప్రధాని మోడీ ప్రభుత్వం ధైర్యంగా అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications