ఆ విషయంలో తొలి ప్రపంచ నాయకుడిగా ప్రధాని మోదీ సంచలన రికార్డు!!
భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ మరొక ఘనతను సాధించారు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా నరేంద్ర మోడీ రెండు కోట్ల మంది సబ్ స్క్రైబర్ లను పొంది ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి నేతగా చరిత్రలో నిలిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చెందిన యూట్యూబ్ వీడియోలో ఇప్పటికీ దాదాపు 450 కోట్ల వ్యూస్ కూడా పూర్తయ్యాయి.
నరేంద్ర మోడీ యూట్యూబ్ ఛానల్ వ్యూస్ సబ్స్క్రైబర్ల విషయంలో భారతీయ భౌగోళిక సమకాలీన నేతలందరినీ అధిగమించి అత్యధికంగా సబ్స్క్రైబర్లు ఉన్న చానల్ గా ఘనత సాధించింది. వ్యక్తిగత యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రయిబర్ల సంఖ్య రెండు కోట్లకు చేరుకున్న తొలి ప్రపంచ నాయకుడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఘనత సాధించడం ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది.

తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలు, లైవ్ కార్యక్రమాలను ప్రధాన నరేంద్ర మోడీ పోస్ట్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాల్లో మోడీ చానల్ కు అత్యధిక స్థాయిలో సబ్స్క్రైబర్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. నరేంద్ర మోడీ తన యూట్యూబ్ ఛానల్ 2007లో క్రియేట్ చేశారు. ఆయన గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలోనే ఈ యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించారు.
2019లో కాశీ పర్యటన సమయంలో దివ్యాంగులు ఆయనకు వెల్కం చెప్పిన వీడియోను మోడీ షేర్ చేయగా, ఆ వీడియోను ఎక్కువ మంది వీక్షించారు.ఆపై నాటి ఇస్రో చైర్మన్ కేశివన్ భావోద్వేగానికి లోనైన వీడియోని మోడీ పోస్ట్ చెయ్యగా అది కూడా బాగా ట్రెండ్ అయ్యింది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తో మోడీ ఇంటర్వ్యూ కూడా ప్రధాని మోడీ యూట్యూబ్ ఛానల్ కు ఎక్కువ మంది వీక్షకులను తెచ్చిపెట్టింది.
అంతేకాకుండా దేశానికి సంబంధించిన, ప్రధాని మోడీ చెప్పాలనుకున్న ఏ విషయాన్నైనా యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్పడంతో, విలువైన సమాచారం ప్రధాని మోడీ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందుతున్న క్రమంలో ప్రతి ఒక్కరు ఆయన యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు .
ఇక ఇటీవల సాధారణ యూట్యూబర్ మాదిరిగా తన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మోడీ తన ప్రసంగంలో వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోవాలని ప్రధాన నరేంద్ర మోడీ కోరడం భారతీయులకు ఆశ్చర్యం కలిగించినా, ఆయనను చరిత్రలో నిలిచేలా చేసింది. ప్రపంచంలోనే యూట్యూబ్లో రెండు కోట్ల మంది సబ్స్క్రైబర్లను సాధించిన తొలి రాజకీయ నేతగా చరిత్రలో ప్రధాని నరేంద్ర మోడీ నిలిచిపోయారు.












Click it and Unblock the Notifications