బెర్లిన్ గోడలు బద్దలైన రోజే.. సుప్రీం తీర్పు దేశవాసుల్ని ఏకం చేసింది.. మోడీ భావోద్వేగ ప్రసంగం

భారత్‌లోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశంలో ఈ రోజు (నవంబర్ 9వ తేదీ) అరుదైన దృశ్యం ఆవిష్కరించింది. భిన్నత్వంలో ఏకత్వానికి చిహ్నంగా నిలిచింది అని అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత అన్ని వర్గాలు సహృదయంతో స్వీకరించాయి. ప్రజలు చూపిన సంయమనం, ఐక్యత మన సంస్కృతికి, సంప్రదాయలకు అద్దంపట్టింది. ఈ రోజు జరిగిన సంఘటన చరిత్రలో నుంచి వచ్చింది కాదు 100 కోట్లకుపైగా ప్రజలుహృదయంలో నుంచి వచ్చింది. భారత్‌కు భిన్నత్వంలో ఏకత్వం అనే పేరుంది. దాని గురించి మనం ఎప్పుడు గొప్పగా చెప్పుకొంటాం. ఈ విషయం మరోసారి ఈ రోజు రుజువైంది. ఐక్యతను చాటి ప్రజలు సరికొత్త చరిత్రను లిఖించారు అని మోడీ తెలిపారు.

 ధైర్యంతో వాదనలు వింటూ

ధైర్యంతో వాదనలు వింటూ

అయోధ్యపై తీర్పుకు ముందు సుప్రీంకోర్టు అన్ని వర్గాల వాదనలు విన్నది. ధైర్యంతో వాదనలు ఆలకించింది. అందుకే ఈ తీర్పుకు అందరి సమ్మతి లభించింది. ఈ తీర్పుకు సమ్మతి లభించడం అసాధారణమైన విషయం. ఇందుకోసం ఉన్నత న్యాయస్థానం ఎంతో కృషి చేసింది. దశాబ్దాల కేసుకు ముగింపు లభించింది. అందుకే సుప్రీంకోర్టు తీర్పును ప్రతీ ఒక్కరు అభినందిస్తున్నారు.

 బెర్లిన్ గోడలు బద్దలైన రోజే

బెర్లిన్ గోడలు బద్దలైన రోజే

ఈ రోజు నవంబర్ 9వ తేదీ. సరిగ్గా 30 ఏళ్ల క్రితం నవంబర్ 9వ తేదీనే బెర్లిన్ గోడలు బద్దలయ్యాయి. ఇరుదేశాల మధ్య ఉన్న గోడలు తొలగి ఒక్కటయ్యాయి. ఇదే నవంబర్ 9వ తేదీన కార్తార్‌పూర్ సాహిబ్ కారిడార్ ప్రారంభమైంది. ఇరుదేశాల మధ్య అంతరాలు తొలిగిపోయాయి. అందులో భారత్, పాకిస్థాన్‌ దేశాల చొరవ ఉంది. ఇదే రోజు అయోధ్య తీర్పు దేశవాసుల్ని ఏకం చేసింది. ఇలాంటి నవంబర్ 9వ తేదీ ప్రజలను ఐక్యం చేసే చర్య.. ప్రజలను కలిసిమెలిసి ఉండేలా గొప్ప రోజు అని ప్రధాని మోడీ అభినందించారు.

కఠినత్వం ఉంటే దూరం

కఠినత్వం ఉంటే దూరం

ఎక్కడైనా.. ఎవరి మనసులోనైనా ఏ మాత్రం కఠినత్వం ఉంటే ఈ రోజు దానిని కూడా దూరం చేస్తుంది. నయా భారత్‌లో కఠినత్వం, భయానికి, ద్వేషానికి స్థానం లేదు. సుప్రీంకోర్టు తీర్పు దేశానికి ఓ సందేశం ఇచ్చింది. అత్యంత క్లిష్టమైన సమస్యలు కూడా చట్టాల ద్వారా పరిష్కృతమవుతాయని రుజువైంది. సుప్రీంకోర్టు తీర్పు తన తీర్పుతో దేశంలో కొత్త శకాన్ని ప్రారంభించింది. దేశ న్యాయ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు అని మోడీ చెప్పారు.

 క్లిష్టమైన సమస్యకు సానుకూల పరిష్కారం

క్లిష్టమైన సమస్యకు సానుకూల పరిష్కారం

మన కుటుంబంలో వచ్చే సమస్యలను పరిష్కరించుకోవడం అంత సులభం కాదు. కానీ దేశంలోనే అత్యంత క్లిష్టమైన సమస్యను సుప్రీంకోర్టు అందరికీ ఆమోద యోగ్యం ఉండేలా పరిష్కరించడం గొప్ప విషయం. ఈ తీర్పు వెనుక ధృడమైన సంకల్పం ఉంది. ప్రధాన న్యాయమూర్తి, ఉన్నత నాయస్థానం, న్యాయవ్యవస్థ చేసిన కృషిని మాటల్లో చెప్పలేం అని మోడీ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+