Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాజీలేదు: సైనికులతో ప్రధాని మోడీ దీపావళి వేడుకలు

ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి సంవత్సరంలానే ఈసారి కూడా సైనికులతో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ అక్కడి కచ్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సరిహద్దు భద్రతా దళం, ఆర్మీ, నేవీ, వాయుసేన సిబ్బందితో వేడుకలు చేసుకున్నారు. కచ్‌లోని సర్ క్రిక్ ప్రాంతంలో గల లక్కీ నాలాకు మోడీ బోటులో చేరుకున్నారు.

సైనిక దుస్తుల్లో వెళ్లిన మోడీ.. భద్రతా సిబ్బందికి మిఠాయిలు తినిపించి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్ తన శత్రువుల మాటలను కాదు.. సైనికుల దృఢ నిశ్చయాన్ని విశ్వసిస్తుందని ఈ సందర్బంగా ప్రధాని మోడీ అన్నారు. ప్రజలంతా సైనికుల వల్లే దేశం సురక్షితంగా ఉందని భావిస్తున్నారని తెలిపారు. భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అడుగులు వేస్తున్నామని.. ఈ కలలకు సైనికులే రక్షకులని అన్నారు.

Prime Minister Narendra Modi s Diwali celebrations with soldiers in Kutch

సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడమే తమ ప్రథమ ప్రాధాన్యమని తెలిపారు. ఒక్క అంగుళం భూమి విషయంలోనూ రాజీ పడబోమని ప్రధాని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని సహించబోమంటూ పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరికలు చేశారు. కాగా, ఈ భౌగోళిక ప్రాంతంలో విధులు నిర్వహించడం చాలా క్లిష్టతరమైనది. పగలు అత్యధిక వేడి, రాత్రుళ్లు అత్యధిక చలి ఉంటుంది. భూభాగం కూడా సవాలుతో కూడుకుని ఉంటుంది.

అంతకుముందు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని కేవడియాలోని ఐక్యతా విగ్రహాన్ని ప్రధాని మోడీ సందర్శించారు. పటేల్ విగ్రహానికి నివాళులర్పించి స్థానికులతో కలిసి ఐక్యాతా ప్రమాణం చేశారు. ఈ సందర్బంగా నిర్వహించిన జాతీయ ఐక్యతా దివస్ పరేడ్‌లో పాల్గొని సైనిక సిబ్బంది విన్యాసాలు, కళాకారుల ప్రదర్శనలను వీక్షించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. దేశ ప్రగతికి అడ్డుగోడలా ఉందనే ఆర్టికల్‌ 370ని తొలగించామని తెలిపారు. ఉమ్మడి పౌరస్మృతి దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. స్థానిక భాషల అభివృద్ధికి కేంద్రం అండగా ఉంటుందన్నారు. దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు బయటి, లోపలి శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌ దేశ వికాసానికి దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఏటా ఎన్నికల వల్ల దేశ ప్రగతి కుంటుపడుతోందని వ్యాఖ్యానించారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ తో దేశ ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.

కాగా, 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వచ్చిన నాటి నుంచి నరేంద్ర మోడీ ప్రతియేటా సైనికులతో కలిసి వేడుకలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. భద్రతా దళాలతో ముచ్చటించడంతోపాటు వారికి స్వీట్లు తినిపించి సరదాగా గడుపుతూ వారిలో స్ఫూర్తిని నింపుతున్నారు. 2014లో మోడీ తొలిసారి సియాచిన్‌లో సైనికులతో కలిసి దీపావళి జరుపుకున్నారు. 2022లో కార్గిల్‌లో, గత సంవత్సరం చైనా సరిహద్దులోని లేప్చా సైనిక శిబిరంలో వేడుకలు జరుపుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+