ప్రియాంక చోప్రానే ఎక్కువ ఉపయోగించుకుంటున్నారు!

ముంబై: కంప్యూటర్లను హ్యాక్ చేసి వ్యక్తిగత సమాచారం దొంగిలించే సైబర్ నేరగాళ్లు బాలీవుడ్ నటీనటుల వ్యవహారాలు, వారికి సంబంధించిన గాసిప్స్‌నే వినియగదారులకు ఎరగా వేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటి ప్రియాంక చోబ్రా టాప్‌లో ఉంది.

ఈ విషయాన్ని ఇంటెల్ సెక్యురిటీ సంస్థ నివేదిక తెలిపింది. గత ఏడాది అలియా భట్‌కు సంబంధించిన వీడియోలు, వ్యవహారాలను చూసేందుకు క్లిక్ చేసిన వారు అధిక సంఖ్యలో హ్యాకర్ల బారిన పడగా.. ఈ ఏడాది ఆ స్థానంలోకి ప్రియాంక చోప్రా ఆక్రమించిందని పేర్కొంది.

శ్రద్ధా కపూర్ రెండో స్థానంలో ఉన్నారు. ప్రమాదకర వెబ్‌సైట్ల వైపుకు ఇంటర్నెట్ వినియోగదారులను ఆకర్షించేందుకు బాలీవుడ్‌ నటి ప్రియాంకా చోప్రా పేరును సైబర్‌ మోసగాళ్లు ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారని ఇంటెల్ భద్రతా నివేదిక వెల్లడించింది.

Priyanka Chopra 'most sensational Indian celeb' online: Intel

సంస్థ బుధవారం విడుదల చేసిన ''భారత అంతర్జాలంలో సంచలనాత్మక ప్రసిద్ధ వ్యక్తుల జాబితా''లో ప్రియాంకా అగ్రస్థానంలో నిలిచింది. ఆలియా భట్‌ స్థానాన్ని ప్రియాంక భర్తీ చేసినట్లు తెలిపింది.

ఈ జాబితాలో రెండు, మూడు స్థానాల్లో వరుసగా నటి శ్రద్ధా కపూర్‌, టీవీ నటుడు కపిల్‌ శర్మ నిలిచారు. మొదటి 10 మంది వ్యక్తుల పేర్లతో ఉన్న లింక్‌పై క్లిక్ చేసినప్పుడు 11.47 శాతం వరకూ వైరస్‌ లేదా అనుమానాస్పద వెబ్‌సైట్లలోకి వినియోగదారులు వెళ్లినట్లు నివేదిక పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+