వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2019 సాధరణ ఎన్నికల్లో కాదు , బై ఎలక్షన్లలో ప్రియాంక పోటీ

|
Google Oneindia TeluguNews

యూపి ఇంచార్జ్ ప్రియాంక గాంధి, పోలిటికల్ ఎంట్రి చేసినప్పటి నుండి ఆమే ఏదో ఒక పార్లమెంట్ స్థానం నుండి పోటి చేస్తుందని ప్రచారం జరిగింది.దీంతో ప్రియాంక ఎక్కడనుండి పోటి చేస్తారనే ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ప్రధాని మోడి పై పోటిగా బరిలో నిలబడతారనే ప్రచారం జరిగింది. నామినేషన్లకు గడువు ముగుస్తుండడంతో ఈ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తెరదింపుతూ వారణాసి నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా అజయ్ రాయ్ ను బరిలోకి దింపింది.

యూపి ప్రచార భాద్యతలతోనే పోటికి దూరం

యూపి ప్రచార భాద్యతలతోనే పోటికి దూరం

ప్రియాంక గాంధి ఈ ఎన్నికల్లో పోటి నిరాకరించింది. ముఖ్యంగా యూపిలో ప్రచార భాద్యతలు చేపట్టిన ప్రియాంక వాటిపై ఎక్కువగా దృష్టి సారించిందని , ఈనేపథ్యంలోనే ఆమే పోటి నుండి తప్పుకుంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా దేశంలో యూపిలో ఎక్కువ సీట్లు ఉండడం ఆ రాష్ట్ర్రంలో గెలిచిన స్థానాలను బట్టి దేశంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉండడం అనేది రాజకీయంగా అందరికి తెలిసిన విషయమే. మొత్తం మీద ప్రియాంక మాత్రం ఎన్నికల్లో పోటి చేయడం లేదనేది తేలిపోయింది.

వయనాడ్ , అమేఠీ ;రెండు స్థానాల్లో గెలుస్తాడా ?

వయనాడ్ , అమేఠీ ;రెండు స్థానాల్లో గెలుస్తాడా ?

ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధి ఉత్తరాధి లో అమేఠీ లోక్ సభ స్థానంతో పాటు తన స్థానం మైన కేరళలోని వయనాడ్ లో కూడ నామినేషన్ వేసి రెండు స్థానాల్లో పోటి చేస్తున్నారు. రాహుల్ గాంధి రెండు చోట్ల గెలుస్తారని , ఎన్నికల అనంతరం ఆయన ఏదో ఒక స్థానం ఖాలీ కానుండడంతో అక్కడి నుండి ప్రియాంక గాంధిని రంగంలోకి దింపనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఆలోచనతోనే ప్రియాంక గాంధి ఈ సాధరణ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

అమేఠీ నుండి పోటిలో రాహుల్ కు దీటుగా స్మృతి ఇరాని

అమేఠీ నుండి పోటిలో రాహుల్ కు దీటుగా స్మృతి ఇరాని

అయితే అమేఠీ నుండి రాహుల్ గాంధికి దీటుగా కేంద్రమంత్రి స్మృతి ఇరాని పోటి చేస్తున్న విషయం తెలిసిందే , అక్కడ మూడో సారి రాహుల్ పైన పోటి చేస్తున్న స్మృతి ఇరాని కి ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉన్నాయనేది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే రాహుల్ గాంధి దక్షిణాది రాష్ట్ర్రం కేరళ నుండి పోటి చేస్తుందని చెబుతున్నారు. మరి ఇలాంటీ పరిస్థితిలో ప్రియాంక గాంధికి అవకాశం ఉంటుందా అనేది ఎన్నికల అనంతరం తేలాల్సిన అంశం.

English summary
Priyanka Gandhi Vadra will not contest the national election is still ,but she may contest in by-elections says party source
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X