నా తల్లి మంగళసూత్రమిస్తే, అమ్మమ్మ బంగారమిచ్చింది-మోడీకి ప్రియాంక ఘాటు కౌంటర్..!
చొరబాటుదారులకు దేశ సంపద ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, చివరికి మహిళల మంగళసూత్రాలు కూడా మిగిల్చే పరిస్దితి లేదంటూ ప్రధాని మోడీ చేసిన విమర్శలకు ప్రియాంక గాంధీ ఘాటు కౌంటర్ ఇచ్చారు. మీరు ఏ మంగళసూత్రాల గురించి మాట్లాడుతున్నారంటూ బెంగళూరులో ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ల పాలనలో ఎప్పుడైనా ఇలా జరిగిందా అని నిలదీశారు. తన తల్లి సోనియా దేశం కోసం తన మంగళసూత్రాల్నే ఇచ్చేసిందని, అమ్మమ్మ ఇందిర యుద్ధ సమయంలో దేశం కోసం సొంత బంగారం ఇచ్చేసిందని ప్రియాంక గుర్తుచేశారు.
టీవీ ఆన్ చేస్తే దేశ సంక్షేమం కోసం, అభివృద్ధి ప్రణాళికలు వినిపించడం లేదని, బీజేపీ నేతల పిచ్చిమాటలు వినిపిస్తున్నాయని ప్రియాంక గాంధీ మండిపడ్డారు. మీ బంగారం, మీ మంగళసూత్రాన్ని కాంగ్రెస్ తీసేసుకుంటుందని బీజేపీ భయపెడుతోందని, దేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లయిందని, మీ బంగారం, మంగళసూత్రాలు ఎవరైనా దోచుకున్నారా అని ఆమె ప్రశ్నించారు. దేశాన్ని 55 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ పాలించిందని, అప్పుడైనా ఎవరైనా దోచుకున్నారా అని అడిగారు.

యుద్ధం జరుగుతుంటే తన అమ్మమ్మ ఇందిరాగాంధీ సొంత బంగారాన్ని త్యాగం చేసిందని, తన తల్లి దేశం కోసం మంగళసూత్రాన్నే త్యాగం చేసిందని ప్రియాంక గుర్తుచేసుకున్నారు. బీజేపీ, ప్రధాని మోడీ ఏం త్యాగాలు చేశారని ప్రియాంక ప్రశ్నించారు. 400 సీట్లు వస్తే రాజ్యాంగం మారుస్తామంటున్నారని, తనను తిట్టి, మతం గురించి మాట్లాడి బీజేపీ ఏం సాధిస్తుందని అడిగారు.
అసలు మంగళసూత్రం ప్రాముఖ్యతను ప్రధాని అర్థం చేసుకున్నారా అని ప్రియాంక వాద్రా ప్రశ్నించారు. మంగళసూత్ర ప్రాముఖ్యతను మోదీజీ అర్థం చేసుకుని ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడి ఉండేవారు కాదన్నారు నోట్ల రద్దు జరిగినప్పుడు మహిళల పొదుపు సొమ్మును ఎత్తుకెళ్లారని, రైతుల నిరసనలో 600 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని మోదీ అనుకున్నారా? ఆ వితంతువుల మంగళసూత్రం గురించి మాట్లాడరా అని అడిగారు.
-
Bengaluru: ఉలిక్కిపడ్డ గార్డెన్ సిటీ..డెడ్ బాడీతో పోలీసులకు సరెండర్..!! -
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
రేపే ఐపీఎల్ ఓపెనర్: మెట్రో రైల్ లో ఫ్రీ ట్రావెల్: మంత్రులకూ -
300 లోడింగ్.. చేసేది ఆ జట్లేః టీమిండియా లెజెండర్ -
SRH.. ఏదో తేడాగా ఉందేంటీ -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications