ఎన్నికల్లేకపోతే వ్యవసాయ చట్టాలు రద్దయ్యేవా ? ఓటర్లకు ప్రియాంకా గాంధీ ప్రశ్న
యూపీ అసెంబ్లీ మూడో దశ పోరుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వ్యవసాయ చట్టాలపై మోడీ సర్కార్ వ్యవహరించిన తీరును కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఓటర్లకు మరోసారి గుర్తుచేశారు. వ్యవసాయ చట్టాల్ని బలవంతంగా తీసుకురావడం, ఆ తర్వాత రైతుల ఆందోళనలు, చివరికి కేంద్రం వాటిని వెనక్కి తీసుకున్న తీరును యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గుర్తు చేస్తున్నారు.
యూపీ మూడో దశ ఎన్నికల ప్రచారం చివరి రోజు వర్చువల్ ర్యాలీలో మాట్లాడిన ప్రియాంక గాంధీ.. బీజేపీని పూర్తిస్ధాయిలో టార్గెట్ చేశారు. యూపీలో యోగీ సర్కార్ పేదలకు ఉచితంగా ఇచ్చిన రేషన్.. వారిని ప్రభుత్వంపై ఆధారపడేలా చేసిందని, వారి కాళ్లపై వారు నిలబడేలా చేయలేకపోయిందని ప్రియాంక ఆరోపించారు. పేదలు ఉచితంగా రేషన్ అందుకుంటే తమకు వచ్చిన ఇబ్బందేమీ లేదని, కానీ వారిని ప్రభుత్వంపై ఆధారపడేలా చేయడమే తప్పని ప్రియాంక తెలిపారు.
పేదలు తమ కాళ్లపై తాము నిలడేలా చేయాల్సింది పోయి వారిని తమపై ఆధారపడేలా చూసుకుంటున్నారని, ఈ రాజకీయాల్ని మాత్రమే తాము తప్పుబడుతున్నట్లు ప్రియాంక విపరించారు.

ఉపాధి, సాధికారత, మహిళల భద్రత, విద్య, ఆరోగ్యం, ద్రవ్యోల్బణం నియంత్రణ వంటి అంశాల గురించి కాంగ్రెస్ మాట్లాడుతోంది, కానీ తమ ప్రత్యర్ధులైన బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ మాత్రం రాజకీయాలలో మునిగిపోయాయని ప్రియాంగ గాంధీ అన్నారు. కులం, మతతత్వం. అధిక విద్యుత్ బిల్లులు,ఎరువుల కొరత,పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం, విచ్చలవిడి జంతువులు పొలాలను నాశనం చేయడం వంటి అనేక సమస్యలను రైతులు ఎదుర్కొంటున్నారని, అయితే వాటిని పరిష్కరించడంలో బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం విఫలమవడమే కాకుండా, తమ ప్రయోజనాలను మాత్రం నెరవేర్చుకుంటోందని విమర్శించారు.బీజేపీ రాజకీయాలు దాని పెద్ద కార్పొరేట్ స్నేహితుల కోసమేనని. వారి విధానాలు, రాజకీయాలు,మీడియా అన్నీ వారి స్నేహితుల కోసమే పనిచేస్తున్నాయన్నారు.












Click it and Unblock the Notifications