వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షూ రగడ : ప్రజలను అవమానించారు : ప్రియాంక, స్వయంగా చూసి పరిస్థితి తెలుసుకోవాలన్న స్మృతి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : కేంద్రమంత్రి, అమేథీ బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీపై కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక గాంధీ ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. అమేథీలో స్మృతి షూ పంచి ఇక్కడి ప్రజలను అవమానించారని విమర్శించారు. తమకు అది కావాలి, ఇది కావాలి అని అమేథీ ప్రజలు భిక్షం అడుక్కొరు, కానీ స్మృతి షూ పంచి తన స్థాయిని మరింత దిగజార్చుకుందని మండిపడ్డారు.

మరో మోసం ..

మరో మోసం ..

అమేథీ కాంగ్రెస్ కంచుకోట అని, ఇక్కడి నుంచి పోటీ చేసి తమ కుటుంబాన్ని జాతీయస్థాయి నేతలుగా నిలబెట్టారని గుర్తుచేశారు. అమేథీ ప్రజలను మోసం చేయడానికి బీజేపీ తప్పుడు హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. అమేథీ, రాయ్ బరేలి ప్రజలను వంచించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. అంతేకాదు బీజేపీ 50 లక్షల ఉద్యోగాలు కోల్పోయేందుకు కారణమైందని విమర్శించారు.

జత షూ కూడా లేవు ...

జత షూ కూడా లేవు ...

ప్రియాంక ఆరోపణలపై స్మృతి స్పందించారు. ఒకవేళ ప్రియాంక నటి అయితే మరింత బాగా జీవించేదని .. కానీ ఆమెకు నటించడం రాదని సెటైర్లు వేశారు. అమేథీ ప్రజల్లో కొందరికీ జత షు కూడా లేవని పేర్కొన్నారు. అందుకోసమే వారికి షూ పంపిణీ చేశానని తెలిపారు. ఒకవేళ చెప్పింది నమ్మకుంటే స్వయంగా వెళ్లి మీ కళ్లతో చూడాలని ప్రియాంకకు సూచించారు స్మృతి.

కొనలేరు కాబట్టి ...

కొనలేరు కాబట్టి ...

'నేను ఒక నటిని, ఈ విషయాన్ని ప్రియాంక తోసిపుచ్చలేరు. పేదల కోసమే షూ పంపిణీ చేశానని పేర్కొన్నారు స్మృతి. ఇంకా ఆమెకు ఏ కోసనైనా అనుమానం ఉంటే సత్యాన్ని తెలుసుకోవాలి‘ అని సూచించారు స్మృతి ఇరానీ.

English summary
Priyanka Gandhi Vadra on Monday attacked Bharatiya Janata Party (BJP) leader Smriti Irani for distributing shoes to people in Amethi, a traditional Congress bastion. Priyanka Gandhi said Irani has disrespected the people of the constituency by her act. Smriti Irani is contesting the elections against Congress president Rahul Gandhi from Amethi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X