మా నాన్న శరీర భాగాల్ని ఇంటికి తెచ్చా-కానీ మోడీలాంటోళ్లను.. ప్రియాంక భావోద్వేగం..!

కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ప్రధాని మోడీ చేస్తున్న దారుణ వ్యాఖ్యలకు ఆయన సొంతగడ్డ గుజరాత్ లోనే ప్రియాంక గాంధీ గట్టిగా బదులిచ్చారు. దేశ సంపదను ఎక్కువ పిల్లలున్నోళ్లకు పంచుతారు, మంగళసూత్రాల్నీ లాక్కుంటారన్న మోడీ వ్యాఖ్యలపై గుజరాత్ లోని వల్సాద్ లో ఉన్న ధరంపూర్ గ్రామంలో ప్రియాంక మండిపడ్డారు. తాన చాలా మంది ప్రధానుల్ని చూశాను, చివరికి మా నాన్న చనిపోతే శరీరభాగాన్ని ఇంటికి తెచ్చానంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.

కానీ మోడీ లాంటి అబద్ధాల కోరుల్ని మాత్రం చూడలేదంటూ ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. తాను చాలా మంది ప్రధాన మంత్రులను చూశానని, కేవలం తన కుటుంబం నుంచే కాదు, వారిలో ఇందిరా గాంధీ ఒకరన్నారు. ఆమె ఈ దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిందన్నారు. రాజీవ్ గాంధీ కూడా ప్రధానమంత్రి అని, తాను ఆయనను ముక్కలు ముక్కలుగా ఇంటికి తీసుకువచ్చానన్నారు. ఆయన తన దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడన్నారు.

priyanka gandhi targets pm modi in gujarat reminds father s assasination to mangalsutra remark

మన్మోహన్ సింగ్ లాంటి ప్రధాని ఈ దేశంలో విప్లవాన్ని తీసుకువచ్చారన్నారు. మీరు కాంగ్రెస్ పార్టీని మించి చూస్తే, కనీసం నాగరికత కలిగిన అటల్ బిహారీ వాజ్‌పేయి ఉన్నారన్నారు. ఈయన మొదటి ప్రధానమంత్రి అని నేను నిశ్చయంగా చెప్పగలనన్నారు. మీరు దేశం ముందు, ప్రజల ముందు అబద్ధాలు ఆడుతున్నారని, నిజం చెప్పాలని అనుకోవడం లేదని ప్రియాంక గాంధీ ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+