ఉత్తరప్రదేశ్ సీఎం అభ్యర్థి ప్రియాంకా గాంధీ ? కాంగ్రెస్ లీడర్స్ డిమాండ్: కొత్త ఊపిరి, ఉప ఎన్నికలు !

న్యూఢిల్లీ/లక్నో: మా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే ప్రియాంకా గాంధీ సీఎం అవుతారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. లోక్ సభ ఎన్నికల సందర్బంగా ఎవ్వరూ ఊహించని రీతితో ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో ప్రియాంకా గాంధీ శకం మొదలైయ్యిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలో ఉత్సహాన్ని నింపడానికి స్వయంగా ప్రియాంక గాంధీ రంగంలోకి దిగుతున్నారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.

కార్యకర్తలకు తాను కొత్త ఊపీరి అవుతానని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారని కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో ప్రియాంకా గాంధీ జోరుగా ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోయింది. అయితే ఉత్తరప్రదేశ్ లో వచ్చే శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రియాంకా గాంధీ ముఖ్యమంత్రి అవుతారని అక్కడి నాయకులు అంటున్నారు.

యోగి ఆదిత్యానాథ్ కు చెక్

యోగి ఆదిత్యానాథ్ కు చెక్

ఉత్తరప్రదేశ్ లో అన్ని భాద్యతలు ప్రియాంకా గాంధీకి అప్పగించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్ణయించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు చెక్ పెట్టాలంటే ఒక్క ప్రియాంకా గాంధీకి మాత్రమే సాధ్యం అవుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ లో అధికారంలోకి రావాలంటే సీఎం అభ్యర్థిగా మీరే ఉండాలని ఇప్పటికే ప్రియాంకా గాంధీకి ఆ రాష్ట్ర నాయకులు మనవి చేశారని అక్కడి మీడియా ప్రచారం చేసింది.

 రాయ్ బరేలి దెబ్బ

రాయ్ బరేలి దెబ్బ

ఉత్తరప్రదేశ్ లో తమ పార్టీ దారుణంగా ఓడిపోవడానికి సొంత పార్టీకి చెందిన కొందరు నాయకులే కారణం అని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రియాంకా గాంధీ దృష్టికి తీసుకువచ్చారని తెలిసింది. సోనియా గాంధీ సొంత నియోజక వర్గం రాయ్ బరేలిలో కాంగ్రెస్ పార్టీ ఈ స్థితి రావడానికి కారణం ఎవరో మీరే ఆరా తియ్యండని ప్రియాంకా గాంధీకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మనవి చేశారని సమాచారం.

ఉప ఎన్నికల ప్రభావం

ఉప ఎన్నికల ప్రభావం

ఉత్తరప్రదేశ్ లో మొత్తం 80 లోక్ సభ నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఊహించని రీతిలో పోటి ఇవ్వలేకపోయింది. అయితే ప్రియాంకా గాంధీ నాయకత్వంలో ఉత్తరప్రదేశ్ లో త్వరలో జరగనున్న 12 శాసన సభ నియోజ వర్గాల్లో బీజేపీకి గట్టి పోటీ ఇవ్వాలని, వీలైనన్ని స్థానాల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్ణయించారు. శాసన సభ ఉప ఎన్నికల ప్రచారంతో పాటు అక్కడి అన్ని భాద్యతలు మీరే తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రియాంకా గాంధీకి మనవి చేశారని సమాచారం.

ఒంటరి పోరు

ఒంటరి పోరు

ఉత్తరప్రదేశ్ లో బీజేపీని ఇంటికి పంపించడం మీకు మాత్రమే సాధ్యం అవుతుందని ఇటీవల ఆ రాష్ట్రంలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రియాంకా గాంధీకి చెప్పారని సమాచారం. ముందుగా సీఎం అభ్యర్థి మీరే అని ప్రకటించి రానున్న ఉత్తరప్రదేశ్ శాసన సభ ఎన్నికల బరిలోకి ఒంటరిగా వెళ్లాలని ప్రియాంకా గాంధీకి మనవి చేశామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజేష్ మిశ్రా అంటున్నారు.

ప్రియాంకా గాంధీ నిర్ణయం

ప్రియాంకా గాంధీ నిర్ణయం

ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ప్రత్యేక దృష్టి సారించాలని ప్రియాంకా గాంధీ నిర్ణయించారని తెలిసింది. ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన అన్ని జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులతో ప్రియాంకా గాంధీ ఇప్పటికే సమావేశం అయ్యి వివరాలు సేకరించారు. అయితే మరోసారి రహస్య సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు సేకరించాలని ప్రియాంకా గాంధీ నిర్ణయించారని తెలిసింది. అయితే ఉత్తరప్రదేశ్ సీఎం రేసులో తాను ఉన్నానని ఎక్కడా ఇంత వరకు ప్రియాంకా గాంధీ చెప్పలేదని, మా నిర్ణయం మాత్రం ఆమెకు చెప్పామని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+