వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐసోలేషన్‌లో ప్రియాంక గాంధీ.. కరోనా నెగిటివ్ అయినా..? ఎందుకంటే..?

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. తన ఫ్యామిలీ మెంబర్, తన సిబ్బంది ఒకరికి నిన్న కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని తెలిపారు. దాంతో తాను ఇవాళ టెస్ట్ చేయించుకున్నానని.. నెగిటివ్ వచ్చిందని తెలిపారు. డాక్టర్లు కొన్నిరోజులు ఐసోలేషన్‌లో ఉండాలని కోరారని చెప్పారు. వారి సూచన మేరకు ఉంటున్నానని వివరించారు. ప్రియాంక గాంధీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి.. యూపీ కాంగ్రెస్ ఎన్నికల ఇంచార్జీ కూడా.. అక్కడ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారం చేపట్టేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నారు.

ప్రియాంక ఫ్యామిలీ మెంబర్ ఎవరో చెప్పలేదు. తన సిబ్బంది అని మెన్షన్ చేశారు కానీ.. వారి గురంచిన డేటా కూడా ఇవ్వలేదు. ప్రియాంక తర్వాత.. రాహుల్, సోనియా కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో వారిద్దరు ప్రియాంకను కలువలేదు అనుకోవచ్చు. భర్త రాబర్ట్ వాద్రా.. పిల్లల ఆరోగ్యం గురించిన సమాచారం మాత్రం లేదు.

Priyanka Gandhi Vadra in home isolation after family member, staff test positive

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. నిన్న దేశంలో 33వేల 750 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 123 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. నిన్న‌ 10వేల 846 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ప్ర‌స్తుతం 1,45,582 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారు. కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,42,95,407గా ఉంది. 4,81,893 మంది క‌రోనా వ‌ల్ల ప్రాణాలు కోల్పోయార‌ు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,45,68,89,306 క‌రోనా వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు.

ఒమిక్రాన్ టెన్షన్‌తో నైట్ కర్ఫ్యూ వచ్చేసింది. చాలా రాష్ట్రాలు రాత్రి పూట కర్ప్యూను ప్రకటించాయి. ఒమిక్రాన్ కేసులు మహారాష్ట్ర, ఢిల్లీలో ఎక్కువగా వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక సహా పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధిస్తున్నాయి. తెలంగాణలో కూడా ఈ నెల చివరి వారంలో విధిస్తామని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు సంకేతాలను ఇచ్చారు.

English summary
Congress leader Priyanka Gandhi Vadra took to Twitter on Monday to state that she will remain in isolation for a few days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X