వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తేయాకు కార్మికురాలిగా .. అసోం ఎన్నికల ప్రచారంలో టీ ఎస్టేట్ లో ప్రియాంకా గాంధీ సందడి

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అసోం లోని టీ ఎస్టేట్ లో సందడి చేశారు. మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ సమయంలో ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడం కోసం అసోం కాంగ్రెస్ యూనిట్ పావులు కదుపుతోంది. అసోంలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగడంతో ప్రియాంక గాంధీ వాద్రా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. రైతులు , మహిళలు, కార్మికులతో కలిసి ముందుకు సాగుతూ వారిని నేరుగా కలుసుకుంటూ ప్రచార పర్వంలో దూసుకెళుతున్నారు.

రైతుల ఆందోళన .. ఢిల్లీ ఘాజీపూర్ బోర్డర్ లో పాక్షికంగా వాహన రాకపోకలు పునరుద్ధరణరైతుల ఆందోళన .. ఢిల్లీ ఘాజీపూర్ బోర్డర్ లో పాక్షికంగా వాహన రాకపోకలు పునరుద్ధరణ

టీ గార్డెన్ లో తేయాకులు కోస్తూ సందడి చేసిన ప్రియాంకా గాంధీ వాద్రా

టీ గార్డెన్ లో తేయాకులు కోస్తూ సందడి చేసిన ప్రియాంకా గాంధీ వాద్రా

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ని గద్దె దించాలని ప్రియాంక గాంధీ వారికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న యువ నేతలైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తమదైన శైలిలో ప్రచారం కొనసాగిస్తున్నారు. అసోం లో ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రియాంక గాంధీ కార్మికుల్లో కార్మికురాలి గా కలిసిపోయారు. టీ గార్డెన్ లో తేయాకులు కోస్తూ కార్మికుల తో కలిసి పని చేశారు.

బిస్వానాథ్‌లోని ఒక టీ ఎస్టేట్ సందర్శించిన ప్రియాంక గాంధీ వాద్రా టీ గార్డెన్ కార్మికులతో సంభాషించేటప్పుడు ప్రియాంక గాంధీ వాద్రా తన సోదరుడు రాహుల్ గాంధీ విధానాన్ని అనుసరించారు.

కార్మిక జీవనాన్ని తెలుసుకున్న ప్రియాంకా .. వారి ప్రేమ మరచిపోలేనని కితాబు

కార్మిక జీవనాన్ని తెలుసుకున్న ప్రియాంకా .. వారి ప్రేమ మరచిపోలేనని కితాబు

తన సందర్శనలో, ప్రియాంక కేవలం కార్మికులతో సంభాషించడమే కాదు, ఒక బుట్టను కూడా తీసుకొని టీ ఆకులను సేకరించటం ప్రారంభించారు. టీ ఎస్టేట్ వద్ద, ప్రియాంక కార్మికులతో వారి అనుమానాలు , భయాలు, వారి ఆశలు మరియు ఆకాంక్షలను అర్థం చేసుకోవడానికి సంభాషించారు. టీ గార్డెన్ సందర్శించిన తరువాత ప్రియాంక గాంధీ వాద్రా కార్మికుల నుండి తనకు లభించిన ప్రేమను మరచిపోలేనని చెప్పారు.

టీ గార్డెన్ కార్మికుల జీవితం సత్యం మరియు సరళతతో నిండి ఉందన్నారు. వారి నిరాడంబర జీవితాన్ని ప్రశంసించారు.

రెండు రోజుల ఎన్నికల ప్రచారంలో ప్రజలతో మమేకమవుతున్న ప్రియాంకా గాంధీ

రెండు రోజుల ఎన్నికల ప్రచారంలో ప్రజలతో మమేకమవుతున్న ప్రియాంకా గాంధీ

వారి శ్రమ దేశానికి ఎంతో విలువైనదని , ఈ రోజు, నేను వారి పని మరియు కుటుంబ శ్రేయస్సు గురించి మాట్లాడానన్నారు. వారి జీవితంలోని ఇబ్బందులను గ్రహించాను అని ప్రియాంక గాంధీ వాద్రా ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.


అనేక మంది కాంగ్రెస్ కార్యకర్తలు మరియు మద్దతుదారులు ప్రియాంక గాంధీ వాద్రా టీ గార్డెన్ కార్మికులతో హృదయపూర్వకంగా సంభాషించే చిత్రాలను పంచుకున్నారు. ప్రియాంక గాంధీ వాద్రా తన రెండు రోజుల అసోం పర్యటన రెండవ రోజు గౌహతిలోని ప్రఖ్యాత కామాఖ్యా ఆలయంలో ప్రార్థనలు చేసిన అనంతరం ఆమె తన పర్యటనను ప్రారంభించారు.

 మార్చి 27 న జరగనున్న అసోం ఎన్నికలు .. పట్టు కోసం కాంగ్రెస్ నేతల పాట్లు

మార్చి 27 న జరగనున్న అసోం ఎన్నికలు .. పట్టు కోసం కాంగ్రెస్ నేతల పాట్లు

గోహపూర్‌లోని మహిళా టీ గార్డెన్ కార్మికులు, స్వయం సహాయక బృంద సభ్యులతో కూడా ఆమె సంభాషించారు.

ప్రియాంక గాంధీ వాద్రా యొక్క రెండు రోజుల పర్యటన మార్చి 27 న జరగబోయే అసోం అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సాగుతుంది. ఆమె తన పర్యటనలో మూడు జిల్లాల్లోని నియోజకవర్గాలు - బిశ్వనాథ్ జిల్లా, సోనిత్పూర్ జిల్లా మరియు గౌహతిలలో పర్యటించారు. ఈ నియోజకవర్గాలలో మొదటిదశలో ఎన్నికలు జరగనున్నాయి.

English summary
On a two-day visit to poll-bound Assam, Congress leader Priyanka Gandhi Vadra adopted her brother Rahul Gandhi’s latest hands-on approach while interacting with tea garden workers in visit a tea estate in Biswanath. During her visit, Priyanka did not just interact with workers, but also picked up a basket and started plucking tea leaves.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X