పోటీ చేయడం లేదు...ప్రచారానికే పరిమితం కానున్న ప్రియాంకాగాంధీ..?

Recommended Video

    Lok Sabha Elections 2019 : Priyanka Gandhi Will Not Be Contesting The Upcoming Lok Sabha Elections ?

    ఢిల్లీ:ఎన్నికలకు కొద్ది నెలల ముందు కాంగ్రెస్ ప్రియాంకా గాంధీని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆమెకు ప్రధాన కార్యదర్శ పోస్టుకూడా ఇచ్చింది. అంతేకాదు ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల బాధ్యత కూడా ఆమె భుజస్కందాలపై వేసింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పోలికలతో ప్రియాంకా గాంధీ ఉండటంతో ఈ ఎన్నికల్లో లాభిస్తుందని కాంగ్రెస్ పార్టీ భావించింది. అయితే ప్రియాంకా గాంధీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుందని అంతా భావించినప్పటికీ ఆమెను ప్రచారానికే పరిమితం చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం.

    Priyanka Gandhi will not contest Lok Sabha elections, address rallies, say sources

    తాను పార్టీ బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, జ్యోతిరాదిత్య సింధియాలతో కలసి తొలి రోడ్‌షోలో పాల్గొన్నారు.అయితే ప్రియాంకా కేవలం కనిపించారు తప్పితే ఎక్కడా ఒక్క మాట మాట్లాడలేదు.ఇదిలా ఉంటే ప్రియాంకా గాంధీ భవిష్యత్తులో జరిగే సభల్లో కూడా ఎక్కడా మాట్లాడరని పార్టీ వర్గాల సమాచారం. కేవలం రాహుల్ గాంధీ మాత్రమే మాట్లాడుతారని కాంగ్రెస్ చెబుతోంది. ప్రియాంకా గాంధీ కేవలం తెరవెనక ఉండి కిందిస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు వ్యూహాలు రచిస్తారని తెలుస్తోంది.

    అమేథీలో ఈ మధ్యే జరిగిన ఓ సభలో ప్రసంగించిన రాహుల్ గాంధీ... త్వరలోనే ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని జోస్యం చెప్పారు. తన సోదరుడి లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ప్రియాంకా గాంధీ ఉత్తర్‌ప్రదేశ్‌లో తన మార్క్ చూపుతారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. జనవరిలోనే బాధ్యతలు చేపట్టిన ప్రియాంకా గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయడం లేదని కేవలం ప్రచారం చేస్తారని తెలుసతోంది. అంతేకాదు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+