Body to Body Spa: లోపల జరిగే యవ్వారమే వేరు, ఎలాంటి అమ్మాయి కావాలి ? ఆన్ లైన్ లో, డిస్కౌంట్!

బెంగళూరు: బెంగళూరు నగరంలో ఐటీ, బీటీ కంపెనీల ఉద్యోగులను, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన వ్యక్తులు, శ్రీమంతులను టార్గెట్ చేసుకుని స్పా ముసుగులో హైటెక్ వేశ్యవాటిక కేంద్రం నిర్వహిస్తున్నారు. అమ్మాయిలకు ఎక్కువ నగదు ఆశ చూపి వారిని హైటెక్ వ్యభిచారం కూపంలోకి లాగి కష్టం లేకుండా డబ్బులు సంపాధిస్తున్నారు. పైకి మాత్రం కొందరు స్పా అంటూ బోర్డులు తగిలించి లోపల అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారని సమాచారం అందడంతో బెంగళూరు పోలీసులు దాడులు చేసి గుట్టురట్టు చేశారు.

కోరమంగలకు ఓ పేరు ఉంది

కోరమంగలకు ఓ పేరు ఉంది

బెంగళూరు నగరంలో కోరమంగల ప్రాంతానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. కోరమంగలలో ఐటీ కంపెనీలతో పాటు, ఎంఎన్ సీ కంపెనీలు వందల సంఖ్యలో ఉన్నాయి. కోరమంగల ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు ఇలాంటి వ్యాపారాలు అక్కడ లేవు అనే మాటే లేదు. కోరమంగలలో అన్ని వ్యాపారాలు జోరుగా జరుగుతున్నాయి.

బాడి టూ బాడి స్పా

బాడి టూ బాడి స్పా

కోరమంగలలో బాడి టూ బాడి స్పా సెంటర్ ఉంది. ప్రతిరోజు బాడి టూ బాడి స్పా సెంటర్ కు అనేక మంది వచ్చి వెలుతున్నారు. పైకి మాత్రమే బాడి టూ బాడి స్పా సెంటర్ నిర్వహిస్తున్నారని స్థానికులు ఇంతకాలం అనుకున్నారు. అయితే అక్కడ జరుగుతున్న తతంగం, యవ్వారమే మాత్రం వేరే.

ఆన్ లైన్ లో ప్రచారం, డీలింగ్

ఆన్ లైన్ లో ప్రచారం, డీలింగ్

బాడి టూ బాడి స్పా సెంటర్ లో అందమైన అమ్మాయిలు ఉన్నారని, మీకు నచ్చిన అమ్మాయిని సెలక్ట్ చేసుకుని ఎంజాయ్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉందని, ఈ విషయం గుట్టుగా ఉంటోదని, మీరు భయపడనవసరం లేదని దాని నిర్వహకులు ఆన్ లైన్ లో విటులను స్పంధించి డిస్కౌంట్ ఇచ్చి డీల్ చేస్తున్నారు.

ఒక్కసారిగా అనుమానం

ఒక్కసారిగా అనుమానం

ఇటీవల కాలంలో అమ్మాయిలు, యువకులు, వ్యాపారులు బాడి టూ బాడి స్పా సెంటర్ కు పోటెత్తుతున్నారు. ఇలా వచ్చి వెళ్లే వారి సంఖ్య ఒక్కసారిగా ఎక్కువైయ్యింది. కోరమంగలలో అనేక స్పా సెంటర్లు నిర్వహిస్తున్నా ఇక్కడికి మాత్రమే ఎందుకు ఎక్కువ మంది వస్తున్నారని, అసలు బాడి టూ బాడి స్పా సెంటర్ లో ఏమి జరుగుతోందని స్థానికులకు అనుమానం మొదలైయ్యింది.

నాకు ఒక అమ్మాయిని సెట్ చెయ్యండి

నాకు ఒక అమ్మాయిని సెట్ చెయ్యండి

స్థానికులు సమాచారం ఇవ్వడంతో సీసీబీ పోలీసులు విటుడి ముసుగులో బాడి టూ బాడి స్పా సెంటర్ నిర్వహకులను సంప్రధించారు. నాకు మంచి అమ్మాయిని సెట్ చెయ్యాలని, రేటు ఎంతైనా పర్వాలేదని సంప్రధించారు. స్పా సెంటర్ నిర్వహకులు పోలీసులు అని పసిగట్టలేక డీల్ మాట్లాడుకుని స్పా సెంటర్ లో అమ్మాయిలను ముందు వరుసగా నిలబెట్టారు. ఆ సమయంలో ఇద్దరు స్పా సెంటర్ నిర్వహకులను రెడ్ హ్యాండెడ్ గా అరెస్టు చేసిన సీసీబీ పోలీసులు వ్యభిచార కూపంలో ఉన్న అమ్మాయిలను రక్షించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి వివేక్ నగర పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+