కులభూషణ్ వ్యవహారంలో తీవ్ర నిరసన : పాక్‌ హై కమిషన్‌కు చెప్పులు పంపిన బీజేపీ నాయకుడు!

న్యూఢిల్లీ : భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్‌ జాదవ్‌ కుటుంబ సభ్యులతో పాకిస్తాన్‌ అమానుష ప్రవర్తనకు వ్యతిరేకంగా భారత్‌‌లో పెద్ద ఎత్తున్న నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నిరసనలో భాగంగా ఢిల్లీ బీజేపీ లీడరు.. పాకిస్తాన్‌ హై కమిషన్‌కు ఆన్‌లైన్‌లో చెప్పులను డెలివరీ చేశారు. కులభూషణ్‌ తల్లి, భార్యతో వ్యవహరించిన తీరు పట్ల నిరసన వ్యక్తంచేస్తూ ఆయన ఈ చెప్పులను డెలివరీ చేసినట్టు పేర్కొన్నారు.

 To Protest Jadhavs' Ill-Treatment, BJP Leader Sends Slippers Online To Pak High Commission

కులభూషణ్‌ను చూసేందుకు వెళ్లిన అతడి తల్లి, భార్య కుంకుమ, తాళిని పాక్ అధికారులు బలవంతంగా తీసేయించిన సంగతి తెలిసిందే. అది తెలియని జాదవ్ వారిని కలిసిన వెంటనే నాన్న బాగానే ఉన్నాడు కదా? అంటూ ప్రశ్నించారు.

కులభూషణ్‌ కుటుంబ సభ్యుల్ని పాకిస్తాన్ ప్రభుత్వం ఘోరంగా అవమానించిందని, ఆయన తల్లిని, భార్యను వితంతువులుగా మార్చేసిందని ఆవేదన వ్యక్తంచేస్తూ భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ఏకంగా పార్లమెంట్‌లోనే కన్నీరు పెట్టుకున్నారు.

ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి తాజిందర్ పాల్ సింగ్ బగ్గా, ఆన్‌లైన్‌‌లో చెప్పులను కొనుగోలు చేశారు. వాటి డెలివరీ కోసం పాకిస్తాన్‌ హై కమిషన్‌ అడ్రస్‌ ఇచ్చారు. ''పాకిస్తాన్‌కు మన చెప్పులు కావాలి. వారికి చెప్పులు పంపండి. నేను చెప్పులు ఆర్డర్‌ చేశా. పాకిస్తాన్‌ హై కమిషన్‌కు పంపాను..'' అని తాజిందర్‌ పాల్‌ సింగ్‌ ట్వీట్‌ చేశారు.

అంతేకాదు, పాకిస్తాన్‌కు చెప్పులు పంపండంటూ ఆన్‌లైన్‌ క్యాంపెయిన్‌ కూడా ఆయన ప్రారంభించారు. ఈ ఆన్‌లైన్‌ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్‌ హై కమిషన్‌కు వందల మంది భారతీయులు తమ నిరసన తెలియజేస్తూ ఫుట్‌వేర్‌ పంపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+