గౌతమి: నెల ముందే దాడికి ప్రయత్నించిన అటెండర్!
బెంగళూరు: గౌతమి పైన అటెండర్ మహేష్ నెల రోజుల క్రితమే దాడికి యత్నించాడని తెలుస్తోంది. ప్రగతి కాలేజ్ హాస్టల్ లోని మూడవ అంతస్తులో గౌతమి, ఆమె స్నేహితురాలు శిరిషా ఉంటున్నారు. వీరిద్దరు తుమకూరు ప్రాంతానికి చెందినవారే. నెల క్రితం మహేష్ గౌతమి గదిలోకి చోరబడ్డాడని, ఆ సందర్బంలో గౌతమి గట్టిగా కేకలు వెయ్యడంతో మహేష్ అక్కడి నుండి పరారైనాడని వెలుగు చూసింది.
గౌతమి అప్పుడే ఈ విషయమై కాలేజ్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. అప్పుడే అతని మీద కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని గౌతమి స్నేహితులు, కాలేజ్ విద్యార్థులు అంటున్నారు.

కాగా, బుధవారం మద్యాహ్నం బెంగళూరులోని వైదేహి ఆసుపత్రిలో గౌతమి మృతదేహానికి పోస్టుమార్టుం నిర్వహించి కుటుంబ సభ్యలకు అప్పగించారు. గౌతమి స్నేహితులు, కాలేజ్ యాజమాన్యం విజ్ఞప్తి చెయ్యడంతో గౌతమి చివరి చూపు కోసం మృతదేహాన్ని కాలేజ్ ఆవరణంలో పెట్టడానికి కుటుంబ సభ్యులు అంగీకరించారు.
గురువారం తుమకూరు జిల్లా పావగడ తాలుకాలో గౌతమి అంత్యక్రియలు జరుగుతాయని ఆమె తండ్రి రమేష్ మీడియాకు చెప్పారు. తన బిడ్డను పోట్టన పెట్టుకున్న మహేష్ ను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని గౌతమి కుటుంబ సభ్యలు అంటున్నారు.












Click it and Unblock the Notifications