వన్ సైడ్ లవ్: అటెండర్ కాల్పులు, విద్యార్థిని మృతి
బెంగళూరు: ఇంటర్ విద్యార్థిని రివాల్వర్ తో కాల్చి హత్య చేసిన సంఘటన బెంగళూరు నగరంలోని కాడుగోడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కాడుగోడి లోని ప్రగతి కాలేజ్ లో పీయుసీ (ఇంటర్) ద్వితీయ సంవత్సరం విద్యాభ్యాసం చేస్తున్న గౌతమి (18) అనే యువతి హత్యకు గురైయ్యింది. ప్రేమ వ్యవహారమే ఇందుకు కారణమని అంటున్నారు. గౌతమి తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో అటెండర్ మహేష్ ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

కర్ణాటకలోని తుమకూరు జిల్లా పావగడ తాలుకాకు చెందిన గౌతమి బెంగళూరు చేరుకుని విద్యాభ్యాసం చేస్తున్నది. గౌతమి కాలేజ్ హాస్టల్ లో నివాసం ఉంటున్నది. ఇదే కాలేజ్ లో 2012 నుండి అగుంబె కు చెందిన మహాష్ ఆఫీస్ బాయ్ గా పని చేస్తున్నాడు.
మంగళవారం రాత్రి గౌతమి సాటి స్నేహితురాలు శిరిషాతో కలిసి హాస్టల్ దగ్గరకు వెళ్లింది. ఆ సమయంలో మహేష్ గౌతమి మీద దాడి చేశాడు. తరువాత జేబులో ఉన్న రివాల్వర్ తీసుకుని గౌతమి మీద కాల్పులు జరిపాడు. బుల్లెట్ గౌతమి తలలోకి దూసుకు వెళ్లింది. తీవ్రగాయాలైన గౌతమి సంఘటనా స్థలంలో మరణించింది.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్య చేసిన మహేష్ పరారైనాడు. హత్యకు కచ్చిమైన కారణాలు తెలియడం లేవని కేసు దర్యాప్తులో ఉందని కాడుగోడి పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications