పుదుచ్చేరిలో మోగిన ఎన్నికల నగారా.. తేదీలు ఇవే..
కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం (మార్చి 15) రోజున 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరగనున్న శాసనసభ ఎన్నికల తేదీలను ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర పాలిత ప్రాంతం అయిన పుదుచ్చేరిలో శాసనసభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. దిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో తాజాగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్.. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్, అభ్యర్థుల నామినేషన్ దాఖలు, నామినేషన్ ఉపసంహరణ, పోలింగ్, ఎన్నికల ఫలితాల తేదీలను వెల్లడించారు. పుదుచ్చేరితో పాటుగా తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కేరళ, అస్సోం రాష్ట్రాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఆ తేదీలను ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది.
ఆ వివరాల ప్రకారం పుదుచ్చేరిలోని మొత్తం 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఒకే విడతలో ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు మే 4న ఉంటుంది. ఇక నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల స్వీకరణ తేదీ మార్చి 16 గా ఉంది. అలాగే నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ మార్చి 23గా ఉంది. ఇక మార్చి 24 న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అలాగే నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ మార్చి 26 గా ఉంది.
ఇక కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. పుదుచ్చేరిలో ప్రస్తుత శాసనసభ పదవీకాలం జూన్ 15 తో ముగుస్తుంది. దీంతో అంతకంటే ముందే అక్కడ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇక పుదుచ్చేరిలో ఎన్డీయే, ఇండియా కూటమిల మధ్య గట్టి పోటీ నెలకొంది.

2021 లో పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే.. మొత్తం 30 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్డీయే కూటమి 16 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ కూటమి 9 స్థానాల్లో గెలుపొందింది. ఇక ఇతరులు 5 స్థానాల్లో విక్టరీ సాధించారు. మొత్తం ఓట్ల శాతం చూస్తే ఎన్డీయే కూటమికి 53 శాతం, యూపీఏ కూటమికి 30 శాతం, ఇతరులకు 17 శాతం ఓట్లు దక్కాయి. ఈ సారి కూడా పుదుచ్చేరిలో ఎన్డీయే, ఇండియా కూటమిల మధ్య గట్టి పోటీ ఉంది.












Click it and Unblock the Notifications