Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Puducherry Exit poll 2021: తొలిసారి బీజేపీకి అధికారం-ఎన్నార్‌ కాంగ్రెస్‌తో

పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎన్డీటీవీ పోల్‌ ఆఫ్ పోల్స్‌ ఎగ్జిట్ పోల్‌ అంచనాలు వెలువడ్జాయి. పుదుచ్చేరి అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో అధికార మార్పిడి తప్పదని తేలిపోతోంది. హోరాహోరీగా సాగిందని భావించినా ఇక్కడ ఎన్నార్ కాంగ్రెస్‌తో జతకట్టిన బీజేపీ ధాటికి కాంగ్రెస్‌ పార్టీ అధికారం కోల్పోక తప్పదని తెలుస్తోంది.

పుదుచ్చేరి అసెంబ్లీలో మొత్తం 30 సీట్లు ఉన్నాయి. ఇందులో ఎన్నార్‌ కాంగ్రెస్‌-బీజేపీ కూటమి 20 సీట్ల వరకూ దక్కించుకోనుందనిఎన్డీటీవీ పోల్‌ ఆఫ్ పోల్స్‌ ఎగ్జిట్ పోల్‌ అంచనా వేస్తోంది. కాంగ్రెస్‌కు కేవలం 10 సీట్లు మాత్రమే దక్కబోతున్నాయి. ఇతరులకు మరో స్ధానం దక్కనుంది. బీజేపీ-ఎన్నార్‌ కాంగ్రెస్‌ కూటమి వైపు ప్రజలు స్పష్టంగా మొగ్గుచూపినట్లు ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్‌ ఫలితాలు చెప్తున్నాయి. ఈ అంచనాలే నిజమైతే తొలిసారి బీజేపీ ఇక్కడ అధికారం అందుకోనుంది.

Puducherry Exit polls 2021: ndtv poll of exit polls predicts mamata to retain bengal

ఎన్డీటీవీ పోల్‌ ఆఫ్ పోల్స్‌ ఎగ్జిట్ పోల్‌ అంచనా ప్రకారం బీజేపీ-ఎన్నార్‌ కాంగ్రెస్‌ కూటమిని ప్రజలు స్పష్టంగా ఆదరించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌లో లుకలుకలు, భారీగా బీజేపీలోకి ఎమ్మెల్యేలు ఫిరాయించడం వంటి కారణాలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపబోతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ఎన్నార్‌ కాంగ్రెస్‌-బీజేపీ తొలిసారి జత కట్టడం కూడా ఇరువురికి లబ్ది చేకూర్చినట్లు అర్దమవుతోంది. దీంతో కాంగ్రెస్‌ భారీగా నష్టపోతోంది. ఇతరులకు మాత్రం ఓ స్ధానం దక్కబోతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+