అర్ధరాత్రి వేళ.. స్కూటర్ పై మహిళా గవర్నర్.. ఏం చేసిందంటే...
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నరు కిరణ్‌బేడి అర్ధరాత్రి వేళ స్కూటర్ పై బయటికెళ్లి పుదుచ్చేరి రోడ్లపై తిరుగుతూ మహిళా భద్రత గురించి పరిశీలించారు. తానెవరనేది తెలియకుండా కిరణ్ బేడీ తన ముఖానికి చున్నీ కప్పు
న్యూఢిల్లీ: పూర్వం రాజులు తమ రాజ్యంలో ప్రజలు ఎలా ఉంటున్నారు, వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా.. అని తెలుసుకునేందుకు మారువేషాల్లో వెళ్లి రాజ్యమంతా తిరిగి పరిశీలించేవాళ్లని కథల్లో వినేవాళ్లం.
అయితే ఈ కాలంలోనూ ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. ఓ మహిళా గవర్నర్ అర్ధరాత్రి వేళ తానెవరనేది తెలియకుండా బయటికెళ్లి మహిళా భద్రత గురించి పరిశీలించారు.

ఈ ఘటన పుదుచ్చేరిలో చోటుచేసుకుంది. ఆమె మరెవరో కాదు.. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నరు కిరణ్‌బేడి. మహిళ భద్రతపై ఆరా తీసేందుకు ఆమె ఓ అజ్ఞాత వ్యక్తి మాదిరిగా వెళ్లి పరిశీలించారు. ద్విచక్రవాహనంపై వెళ్లి ప్రధాన రహదారుల్లో తిరిగారు.
ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు కిరణ్ బేడీ తన ముఖానికి చున్నీ కప్పుకున్నారు. ఎటువంటి భద్రత లేకుండా అర్ధరాత్రి వేళ ఆమె ఎంతో ధైర్యంగా ద్విచక్రవాహనంపై పర్యటించారు. దీని గురించి ఆమే స్వయంగా ట్విటర్ ద్వారా తెలియజేశారు.
'పుదుచ్చేరిలో రాత్రివేళ బయట ఉండటం సురక్షితమే. కానీ భద్రతను మరింత మెరుగుపరుస్తాం..' అంటూ ట్వీట్ చేశారు. ప్రజలు తమకు ఏదైనా అవసరమైతే పీసీఆర్, 100కు ఫోన్ చేసి సహాయం తీసుకోవాల్సిందిగా ఆమె కోరారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications