బర్గర్ తెచ్చిన తంటా : గొంతులో గాజు ముక్కలు, బేకరిపై బాధితుడి న్యాయపోరాటం

పుణే : స్నేహితులతో కలిసి బయటకెళ్లాడు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు వెళ్లి బర్గర్ తీసుకొచ్చాడు. ఎప్పుడు వచ్చాం కదా అని నిర్లక్ష్యమో ... తెలియదు కానీ అతను తిన్న బర్గర్‌లో గాజుముక్క ఉంది. ఇంకేముంది రక్తం కక్కి .. ఆస్పత్రి పాలైన ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకుంది. బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బర్గర్ గాజు ముక్క

బర్గర్ గాజు ముక్క

ఎఫ్ సీ రోడ్ లో గల బర్గర్ కింగ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు వెళ్లాడు సాజిత్ . అంతే అందులో గాజు ముక్క వచ్చింది. అప్పటికే కొంచెం తిన్న సాజిత్ .. నోట్లో నుంచి రక్తం రావడంతో హాస్పిటల్ తరలించారు. తర్వాత ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యాజమాన్యాంపై అతని స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చాలారోజుల తర్వాత స్నేహితులంతా కలిశామని ... సజిత్ బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, కూల్ డ్రింక్ కొనుగోలు చేశాడని అతని ఫ్రెండ్ అజయ్ తెలిపారు.

రూ.521 .. బిల్ 35 వేలు

రూ.521 .. బిల్ 35 వేలు

బర్గర్ కోసం రూ.521 ఇచ్చామని .. తర్వాత అరగించే సమయంలో ఏదో తట్టిందని తెలిపారు. అదేంటో అని చూసే వరకు అందులో చిన్న గాజుముక్క కనిపించిందని పేర్కొన్నారు. తర్వాత సజిత్ వాంతులు కూడా చేసుకున్నాడని వివరించారు. అతను ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైందని తెలిపారు. వెంటనే అక్కడినుంచి సాజిత్ ను ఆస్పత్రికి తరలించారు. స్థానిక దవాఖానలో తీసుకోకుంటే .. సాహ్యాద్రి ఆస్పత్రికి తరలించినట్టు వివరించారు. వారు ఐసీయూలో చేర్చామని .. కోరితే తమ వద్ద చేతిలో డబ్బులు కూడా లేవని వివరించారు. వెంటనే ఎలాగోలా చేర్చి రూ. 15 వేల కట్టామని .. అయితే గొంతులో చిన్న చిన్న గాజు ముక్కలు ఉండటంతో వాటిని తీశామని .. ఇతర ట్రీట్ మెంట్ కోసం రూ. 35 వేల బిల్ వేశారని పేర్కొన్నారు.

పోలీసులకు ఫిర్యాదు

పోలీసులకు ఫిర్యాదు

జరిగిన ఘటనపై ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోలేదని .. అందుకే పోలీసులను ఆశ్రయించామని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై స్పందించమని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యాజమానిని మీడియా కోరితే మాట్లాడేందుకు నిరాకరించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+